Megastar Chiranjeevi: చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాలు చేసిన తేజ సజ్జ ‘ఓ బేబీ’ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించి ఆ తరువాత ‘జాంబిరెడ్డి’ మూవీతో హీరోగా మారి హిట్టు అందుకున్నారు. ఇక ఇప్పుడు ‘హనుమాన్’ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ హనుమాన్ మూవీలో చిరు హనుమంతుడిగా కనబడుతున్నాడు అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్నప్పుడు తేజ మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాతో ఫేమస్ అయిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఇప్పుడు అదే తేజ సినిమాలో చిరంజీవి హనుమంతుడి క్యారెక్టర్ లో కనిపించనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్ వెనక కారణాలు లేకపోలేదు..హనుమాన్ ట్రైలర్ ని విడుదల చేసినప్పుడు హనుమాన్ కళ్ళ వరకే మనకు చూపించారు. ఈ సినిమాలో హనుమంతుని గ్రాఫిక్స్ రూపంలో చూపించబోతున్నామని ముందుగానే చెప్పారు. పైగా హనుమంతుడి రూపాన్ని మనకు పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు.


హనుమాన్  ట్రైలర్ లో హనుమంతుడి కళ్ళను మాత్రమే చూపించారు. ఇక ఆ కళ్ళు చూసిన కొంతమంది హనుమంతుడి రూపం చిరంజీవిని పోలినట్టే ఉంది అని భావిస్తున్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మను ఒక ఇంటర్వ్యూలో అడుగగా…హనుమంతుని పాత్ర ఎవరు పోషించారు అన్నది సస్పెన్స్ అని చెప్పారు.


మెగాస్టార్ చిరంజీవి చిన్న చిన్న సినిమాలకు ప్రమోషన్స్.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం వాయిస్ ఓవర్ ఇవ్వడం.. ఇలాంటి సహాయాలు చేస్తుంటారు అని అది అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమంతుడు రూపంలో చిరుని చూపించాలి అని.. అయితే చిరంజీవిని నటింపచేయడం కాకుండా గ్రాఫిక్స్ ద్వారా హనుమంతుడి రూపాన్ని చిరంజీవిని పోలినట్టు తెరకెక్కించాలని..టీం తో కొన్ని చర్చలు జరిపినట్టు వినికిడి. ఇక దర్శకుడు కూడా తెలివిగా ఏ విషయాన్ని బయట పెట్టకుండా.. హనుమంతుని పాత్రకు సంబంధించిన విషయం సస్పెన్స్ అని.. ఆ పాత్రను ఎవరు పోషించారు అన్న విషయాన్ని తెరిమిదే చూసి తెలుసుకోవాలని…అయితే కచ్చితంగా ఆ పాత్ర అందరికీ సర్ప్రైజ్ ఇస్తుందని తెలియజేశారు. ఇక తాజాగా చక్కర్లు కొడుతున్న రూమర్స్.. అలానే దర్శకుడు మాటల వల్ల  ఈ సినిమాలో చిరు హనుమంతుని రూపంలో కనిపిస్తారని చాలామంది భావిస్తున్నారు. మరో విషయం ఏమిటి అంటే చిరంజీవి  హనుమంతుని భక్తుడు కూడా. మరి చిరంజీవిని పోలిన రూపంలో దర్శకుడు హనుమంతుడిని చూపించి అందరిని సర్ప్రైజ్ చేస్తారేమో చూడాలి.


Also Read: Devil Movie Review: కళ్యాణ్‌ రామ్ డెవిల్ మూవీ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడా..?


Also read: Aquarius Horoscope 2024: ఈ రాశి వారికి కొత్త ఏడాది 2024 ఎలా ఉంటుంది, ఏ సమయంలో ఏం జరగనుందో తెలుసుకోండి


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter