Megastar Chiranjeevi Cancer News: మెగాస్టార్ చిరంజీవి తాజాగా క్యాన్సర్ గురించి చేసిన వ్యాఖ్యలు అటు టాలీవుడ్ వర్గాల్లో మాత్రమే కాదు.... రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా ఒక క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారని ప్రచారం మొదలైంది. అదేమిటంటే... ఇప్పటి వరకు తెలియని విధంగా తాను కూడా క్యాన్సర్ బాధితుడేనంటూ ఆయన ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే క్యాన్సర్ ను తొలినాళ్లలో గుర్తించి కొలనోస్కోపీ చేయించుకోవడం వల్ల ఆ భయంకరమైన వ్యాధి నుంచి బయటపడ్డారని ఆయన వెల్లడించారని ప్రచారం జరిగింది. ఇక తనకు క్యాన్సర్ ప్రారంభ దశలో ఉండగానే గుర్తించి చికిత్స తీసుకున్నానని, తాను క్యాన్సర్ తో జరిపిన పోరాటంలో విజయం సాధించానని... అందుకే ఇంకా మీ ముందు ఇలా ఉండగలుగుతున్నాం అని చెప్పుకొచ్చారని ప్రచారం జరిగింది. ఇక క్యాన్సర్ వచ్చిందని చెప్పడానికి తాను భయపడలేదని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.


ఇక జీనోమిక్స్ అనే టెస్ట్ ద్వారా ముందస్తుగానే క్యాన్సర్ ను గుర్తించవచ్చని వెల్లడించిన చిరంజీవి... తన అభిమానులకు, సినీ కార్మికులకు సైతం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు చేయిస్తానని... వారికోసం ఎన్ని కోట్లు అయినా తాను ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇక హైదరాబాదు అనేది క్యాన్సర్ నియంత్రణకు ఒక హబ్ గా కావాలని ఆ స్థాయికి మనం వెళ్లాలని ఆకాంక్షించారు. కేవలం హైదరాబాద్ వరకే పరిమితంగా తెలంగాణ జిల్లాల్లో సైతం క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలని ఆస్పత్రులను ఆయన అభ్యర్థించారు. ఇక క్యాన్సర్ కి సంబంధించిన అవగాహన కార్యక్రమాల కోసం తన వంతు సహకారాన్ని ఎప్పుడైనా అందించడానికి తాను వెనుకాడేది లేదని ఈ సందర్భంగా ఆయన కుండ బద్దలు కొట్టారు.


Also Read: Saniya Iyappan Photos: బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్సులో సెగలు రేపుతున్న సానియా అయ్యప్పన్


నిజానికి మెగాస్టార్ చిరంజీవి గతంలో కూడా పలు క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు బయట పెట్టలేదు. మొట్ట మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి నోటి వెంట తన క్యాన్సర్ బారిన పడినట్లుగా వెల్లడించడంతో ఆయన అభిమానులు సహా టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ షాక్ అవుతూ కామెంట్లు పెడుతున్న క్రమంలో చిరంజీవి స్పందించారు ''కొద్ది సేపటి క్రితం  నేనొక క్యాన్సర్ సెంటర్ ని  ప్రారంభించిన  సందర్భంగా క్యాన్సర్ పట్ల  అవగాహన పెరగాల్సిన  అవసరం  గురించి  మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్  టెస్టులు   చేయించుకుంటే  క్యాన్సర్ రాకుండా  నివారించవచ్చు అని చెప్పాను. నేను  అలర్ట్  గా  వుండి  కొలోన్ స్కోప్  టెస్ట్  చేయించుకున్నాను. అందులో  non - cancerous polyps ని డిటెక్ట్ చేసి  తీసేశారు  అని  చెప్పాను.  'అలా ముందుగా టెస్ట్  చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద  మారేదేమో' అని  మాత్రమే  అన్నాను.  అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి' అని  మాత్రమే  అన్నాను. 
  
అయితే  కొన్ని  మీడియా సంస్థలు  దీన్ని సరిగ్గా అర్థం  చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో  'నేను  క్యాన్సర్  బారిన పడ్డాను' అని  'చికిత్స  వల్ల బతికాను' అని స్క్రోలింగ్ లు, వెబ్  ఆర్టికల్స్ మొదలు  పెట్టాయి. దీని వల్ల అనవసరమైన  కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది  వెల్ విషర్స్  నా ఆరోగ్యం గురించి  మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ  క్లారిఫికేషన్. అలాగే అలాంటి  జర్నలిస్టులకి  ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు  చవాకులు  రాయకండి. దీనివల్ల  అనేక మందిని  భయభ్రాంతుల్ని  చేసి  బాధ పెట్టిన వారవుతారు. 🙏'' అంటూ ఆయన ట్వీట్ చేశారు. 


Also Read: Raashii Khanna: సీక్రెట్ టెంప్టేషన్ అంటూ ఎద అందాలతో టెంప్ట్ చేస్తున్న రాశి ఖన్నా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK