Bhola Shankar Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' మూవీ సందడి మొదలైంది. ఈ నెల 11న ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రమోషన్ కార్యక్రమాలు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. మెహ‌ర్ రమేష్ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. మరో కీలక పాత్రలో కీర్తి సురేష్‌ నటిస్తోంది. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత మెగాస్టార్ మూవీ వస్తుండడంతో ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ అదిరిపోవడంతో ఎక్స్‌పెటేషన్స్ డబుల్ అయ్యాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆదివారం 'భోళా శంకర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్ అన్నాచెల్లెలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. " మొదటి రోజే చెప్పేశాను. నో అన్నయ్య అని. అన్నయ్యలు చాలా మందికి ఉన్నారు. నీకు అక్కర్లేదు. నా నెక్ట్స్ పిక్చర్‌లో హీరోయిన్‌గా ఉంటే చాలు. ఎంతో సరదాగా ఉంటుంది. ఒక స్వచ్ఛమైన నవ్వు. ఒక జాబిల్లిలాంటి నవ్వు. 


చెప్పాలంటే ఈ అమ్మాయితో షూటింగ్ చేస్తున్నప్పుడు సరదా సరదాగా ఉండేది. పారే నది మీద ఒక పడవ ప్రయాణంలా ఉంటుంది. తను మిస్ అవుతానని అంటే.. మరి నేను కూడా అంటే ఆ లెవల్‌కు తగ్గిపోతానని అనలే. తను రెండుమూడు సార్లు అనేసరికి ఒకసారి అంటే బాగుంటుందని చెబుతున్నాను. ఐ మిస్ యు డార్లింగ్. మిస్ యు సో.. మచ్.." అని కీర్తి సురేష్‌తో అన్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


 




ఏదైన తనకు నచ్చితినే చేస్తానని.. భోళా శంకర్ తనకు నచ్చినందుకే చేశానని చిరంజీవి అన్నారు. అంతగా నచ్చిన సినిమా రేపొద్దున మీ చేత కూడా మార్కులు వేయించుకుంటుందనే ధైర్యంతో ఈ నెల 11 తేదీన మీ ముందుకు రాబోతుంది. "చాలా మంది రీమేక్‌లు చేస్తున్నారేంటి అని అంటున్నారు.. ఒక మంచి కంటెంట్ ఉన్నప్పుడు మన తెలుగు ప్రజలకు ఇవ్వడం కోసం మన తెలుగు డైరెక్టర్లు, యాక్టర్లు రీమేక్‌లు చేస్తే తప్పేంటి..? ఓటీటీలు రావడంతో ఈ మధ్య అందరూ అన్ని సినిమాలను చూస్తున్నారు. మళ్లీ కొత్తగా చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అని అంటున్నారు. వేదాళం మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కడా లేదు. ఇంకా ఎవరూ చూడలేదని ఒప్పుకున్నా. నాకు నచ్చింది కాబట్టే చేశా. మిమ్మల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది.." అని చిరంజీవి చెప్పుకొచ్చారు.


Also Read: Delhi AIIMS Fire Accident: ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులో మంటలు  


Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి లైన్ క్లియర్.. పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook