Megastar Chiranjeevi God Father Movie Day 1 World WIde Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే, ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాకు తెలుగు రీమేక్. తెలుగు వారి అభిరుచులకు తగినట్లుగా అనేక మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్లుగా రూపొందించారు మోహన్ రాజా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాకు మొదటి అటు నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల మీద అందరి దృష్టి పడింది. తాజాగా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే విషయం మీద పూర్తి వివరాలు బయటకు రాలేదు కానీ ఈ సినిమా మొదటిరోజు బాగానే డబ్బులు సంపాదించినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 20 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసినట్లు సమాచారం.  అలాగే ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.


ఇక గాడ్ ఫాదర్ సినిమాలో మురళీ శర్మ, సత్యదేవ్, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, బ్రహ్మాజీ, దివి కీలక పాత్రలలో కనిపించారు.  నయనతార ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించారు. అలాగే సల్మాన్ ఖాన్ ఒక అతిధి పాత్రలో కనిపించడమే కాక స్పెషల్ సాంగ్ లో కూడా మెరిశారు. పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాలో ఒక అతిథి పాత్రలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తో బాధలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఎలా అయినా హిట్ కొట్టాలని చాలా తాపత్రయంతో ఉన్నారు.


ఆ కోరిక ఒకరకంగా ఈ సినిమాతో తీరినట్లే చెప్పాలి ఇంకా ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 16 కోట్ల 50 లక్షల వరకు షేర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కృష్ణాజిల్లాలో 73 లక్షల షేర్ గుంటూరు జిల్లాలో 1. 75 కోట్ల షేర్ వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా నైజాం ప్రాంతంలో 3.23 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో 1.26 కోట్లు కలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో 55 లక్షల షేర్, హిందీ వర్షన్ 80 లక్షల వరకు నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.


గాడ్ ఫాదర్ వసూళ్లు 


నైజాం: 3.29 కోట్లు
సీడెడ్: 3.18 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.26 కోట్లు
తూర్పు గోదావరి: 1.60 కోట్లు (51 లక్షలు అద్దెలు)
పశ్చిమగోదావరి: 59 లక్షలు
గుంటూరు: 1.75 కోట్లు (70 లక్షలు అద్దెలు)
కృష్ణా: 73 లక్షలు
నెల్లూరు: 57 లక్షలు (7 లక్షల అద్దెలు)
AP-TG మొత్తం:- 12.97 కోట్లు (21.40 కోట్ల గ్రాస్) (1.28Cr అద్దెలు)
KA - 1.56 కోట్లు
హిందీ+ROI - 45L
OS - 2.10 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – 17.08 కోట్లు  (31.10 కోట్లు గ్రాస్)


నోట్: ఇవన్నీ వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సమాచారం. వీటిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.


Also Read: Allu Aravind On Chiranjeevi: చిరంజీవితో విభేదాలపై అల్లు అరవింద్ సీరియస్.. పద్ధతేనా అంటూ?


Also Read: Adipurush Prabhas: 'రామ్‌లీలా'లో రావణ దహనం చేసిన ప్రభాస్‌, ఫిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook