Megastar Chiranjeevi In Guinness Book Of World Records: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగి మంచి పేరు సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. హీరో గానే కాకుండా ఇతరులకు సహాయం చేయడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఒక సామాన్య వ్యక్తిగా మొగల్తూరు నుంచి మద్రాస్ లో అడుగుపెట్టిన చిరంజీవి ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు మెగాస్టార్ గా ఎదిగారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన చిరంజీవి తన డాన్స్ లో,  నటనలో ఒక కొత్త రికార్డు సృష్టించారని చెప్పవచ్చు.  ముఖ్యంగా ఆ బాడీలో రిథమ్,  డాన్సుల్లో గ్రేస్ అన్నీ కూడా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇదిలా ఉండగా ఆ డాన్స్ లే ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కేలా చేశాయి. 


తెలుగులో 150 కి పైగా చిత్రాలు చేసిన ఈయన అందులో కొన్ని వందల పాటలకు తనదైన శైలిలో డాన్స్ చేసి మెప్పించారు. ముఖ్యంగా చిరంజీవి తరహాలో స్టెప్పు లు వేసిన ఇండియన్ హీరో మరొకరు లేరు అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు డాన్స్ అంటే జయమాలిని పేరు గుర్తొచ్చేది కానీ అలాంటి వారిని సైతం వెనక్కి నెట్టి తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో మెప్పించారు చిరంజీవి. 


ఇప్పుడు ఆయన నృత్యాలకు గిన్నిస్ బుక్ కూడా ఫిదా అయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి డాన్స్ లకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. ఈరోజు అనగా సెప్టెంబర్ 22వ తేదీన హైదరాబాద్ సిటీలోని ఐటిసి కోహినూర్ హోటల్ వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చేతులమీదుగా ఈ ప్రకటన జరగనున్నట్లు తెలుస్తోంది. 


ఒకరకంగా చెప్పాలి అంటే ఈ సందర్భం అటు మెగా అభిమానులకు ఇటు తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్తు తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వించదగిన విషయమని చెప్పవచ్చు. ఇప్పటికే చిరంజీవికి పద్మ విభీషణ్ అవార్డు లభించింది. అంతేకాదు అక్టోబర్ 28వ తేదీన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా అక్కినేని అవార్డును కూడా ఇవ్వనున్నారు ఇప్పుడు ఆయనకు ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం లభించడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు.


ఏది ఏమైనా చిరంజీవి క్రేజ్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇక ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.


Also read: Bengaluru Horror: బెంగళూరులో హర్రర్, 25 ఏళ్ల యువతి ముక్కలు ముక్కలుగా ఫ్రిజ్‌లో , అసలేం జరిగింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.