Chiranjeevi helps Dondapati Chakradhar: అభిమాని ఆరోగ్యానికి ‘మెగా’ అండ!
Megastar Chiranjeevi Joins his fan Dondapati Chakradhar in Omega Hospital: మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి అండగా నిలిచారు. క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానిని హాస్పిటల్ లో చేర్చారు. ఆ వివరాల్లోకి వెళితే
Megastar Chiranjeevi Joins his fan Dondapati Chakradhar in Omega Hospital: మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా హీరోగా ఒక స్థాయి వచ్చిన తర్వాత ఆయన మరిన్ని సినిమాలు చేయడానికంటే ముందుగా సామాజిక సేవ చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే బ్లడ్ బ్యాంక్ వంటివి స్థాపించి అనేక మంది ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ వస్తున్నారు. [[{"fid":"241624","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
అలాగే ఆయన తన అభిమానులకు ఎలాంటి ఆపద వచ్చిందని తెలిసినా వెంటనే రంగంలోకి దిగుతూ ఉంటారు. ఇప్పటికే పలువురు అభిమానులను తన కోడలికి చెందిన అపోలో హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం అందించి, అలాగే ఒమేగా హాస్పిటల్స్ లాంటి మరికొన్ని హాస్పిటల్స్ లో కూడా ఉచితంగా వైద్యం అందించి కాపాడుకున్నారు. ఇప్పుడు తాజాగా ఒక అభిమానిని మరోసారి ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.[[{"fid":"241625","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
కృష్ణా జిల్లా పెడన పట్టణానికి చెందిన చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్ చిరంజీవి బాటలోనే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పెడన చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అయితే అలాంటి దొండపాటి చక్రధర్ కు క్యాన్సర్ సోకింది. తాను సంపాదించిన అంతా స్వచ్ఛంద సేవకి ఉపయోగించడంతో ఆయన ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.[[{"fid":"241626","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం ఆ చుట్టుపక్కల మరిన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కలిసి కొంత మొత్తాన్ని పోగు చేసి చక్రధర్ కుటుంబానికి అందజేశారు. అయినా మెగాస్టార్ చిరంజీవికి తన అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం తెలియడంతో హుటాహుటిన ఆయనని హైదరాబాద్ రప్పించుకుని ఒమేగా హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. అలాగే ఒమేగా హాస్పిటల్ కి సోమవారం సాయంత్రం వెళ్లి తన అభిమానికి ధైర్యం చెప్పారు.[[{"fid":"241627","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
అక్కడ వైద్యులతో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడి చక్రధర్ ఆరోగ్య పరిస్థితి ఏమిటో తెలుసుకొని దానికి తగినట్లుగా వైద్య సహాయం అందించాలని కోరారు. అలాగే మీ కుటుంబానికి తాను అండగా ఉంటానని వారి కుటుంబ సభ్యులకు కూడా మెగాస్టార్ చిరంజీవి ఆభయం ఇచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హాస్పిటల్ కి వెళ్లి తన అభిమానికి అభియామిస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.[[{"fid":"241628","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
Also Read: Dil Raju Fires on Media: క్లిక్స్ కోసం నన్ను బద్నామ్ చేయొద్దు.. కామన్ సెన్స్ ఉండాలంటూ దిల్ రాజు ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి