Megastar Chiranjeevi : ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా విడుదలైన భోళా శంకర్ సినిమాతో మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిరంజీవి ఇప్పుడు బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా ను అభిమానులు మెగా 156 అని పిలుస్తున్నారు. ఈ మధ్యనే ఒక పూజా కార్యక్రమంతో చిత్ర బృందం ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేసింది. ఇక ఈ సినిమా గురించిన అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. సోషల్ మీడియాలో సినిమాకి సంబంధించిన ఎన్నో అప్డేట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


ఈ సినిమా ఒక సోషల్ ఫాంటసీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన మరొక క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ సినిమా మూడు లోకాల నేపథ్యంలో జరుగుతుంది అని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో లవ్, రొమాంటిక్, ఫాంటసీ జోనర్ లు కూడా ఉండబోతున్నాయి అని, ఈ మూడు జోనర్ లను కలిపి సినిమా ఉంటుందని సమాచారం.


సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందో అని అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతుందో అని ఇప్పటినుంచే అభిమానులలో చర్చ మొదలైంది. మరోవైపు ప్రముఖ టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కావాల్సి ఉంది.


యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. చోటా కే నాయుడు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కమర్షియల్ సినిమాలకి దూరంగా చిరంజీవి ఇలాంటి ఫాంటసీ సినిమా తీస్తుండడంతో అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. మరి చిరంజీవి కి ఇలాంటి విభిన్న జోనర్ సినిమాలు ఎంతవరకు ఉపయోగపడతాయో వేచి చూడాలి.


Also read: ED Raids: ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్, ముఖ్యమంత్రి కుమారుడికి ఈడీ నోటీసులు, విస్తృత సోదాలు


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.