Chiranjeevi starrer Acharya Movie Trailer to released in theaters in AP: టాలీవుడ్ 'మెగాస్టార్' చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' సినిమా నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. 2022 ఫిబ్రవరి 4న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా.. కరోనా వైరస్, ఇతర కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఏప్రిల్‌ 29న ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ విషయంలో చిత్ర యూనిట్ స్పీడ్‌ పెంచింది. ఈ క్రమంలో 'ఆచార్య' సినిమా ట్రైలర్‌ విడుదల తేదిని తాజాగా మేకర్స్ ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్‌ 12న 'ఆచార్య' సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా మేకర్స్‌, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రకటించారు. ఇందుకోసం చిరంజీవి ఎర్ర కండువాతో, రామ్ చరణ్ తుపాకీతో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు సినిమా ట్రైలర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు థియేటర్లలో కూడా ప్రదర్శిస్తున్నారు. కడప, అనంతపురం, చిత్తూర్, కర్నూల్ జిల్లాలోని పలు థియేటర్లలో ఆచార్య ట్రైలర్ విడుదల అవనుంది. 


[[{"fid":"227153","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


గుంటూరు, నెల్లూరు, క్రిష్ణ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరంలోని పలు థియేటర్లలో మంగళవారం సాయంత్రం ఆచార్య ట్రైలర్ ప్రదర్శించనున్నారు. అంతేకాదు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఆచార్య ట్రైలర్ థియేటర్లలో విడుదల అవనుంది. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటినుంచే థియేటర్ల వద్ద మెగాస్టార్ కటౌట్స్ పెడుతున్నారు. సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్‌ నటిస్తున్న చిత్రం కాబట్టి భారీ హైప్ నెలకొంది. 


[[{"fid":"227154","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నక్సలైట్లుగా నటిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్​చరణ్ జతగా పూజాహెగ్డే నటించారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. మణిశర్మ ఆచార్య చిత్రానికి సంగీతం అందించారు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. 


[[{"fid":"227155","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


Also Read: KGF Chapter 2: కథలో కీలకమైన విషయాన్ని చెప్పిన యష్.. అసలు స్టోరీ రివీల్!


Also Read: Ravichandran Ashwin: రవిచంద్రన్‌ అశ్విన్‌ షాకింగ్ నిర్ణయం.. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook