Surekha Konidela: ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన చిరంజీవి సతీమణి.. మొదటి పోస్ట్ ఏంటో తెలుసా?!!
Surekha Konidela opened twitter account. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు.
Megastar Chiranjeevi wife Surekha Konidela opened twitter account: ప్రస్తుతం సోషల్ మీడియాను ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువ. అరచేతిలోనే ప్రపంచాన్ని చూపించే సోషల్ మీడియాను నేటి తరం వారందరూ ఉపయోగిస్తున్నారు. తమ ఆలోచనలు, భావాలను వ్యక్తం చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. ఇక సినీ తారలు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరం స్టార్స్ నెట్టింట్లో ఫోటో షూట్స్, రీల్స్, చాట్స్ అంటూ అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటారు. గతకొంత కాలం నుంచి అలనాటి తారలు కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు.
తాజాగా సురేఖ కొణిదెల ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. ఈ విషయాన్ని ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. 'ఇది నా అధికారిక ట్విట్టర్ ఖాతా. నా డాషింగ్ లవబుల్ సన్ రామ్ చరణ్ తేజ్‌తో మొదటి పోస్ట్' అని ఈరోజు ఉదయం సురేఖ కొణిదెల ట్వీట్ చేశారు. #RRR, #RRRMovie అనే హ్యాష్ టాగ్స్ కూడా ఇచ్చారు. ఫొటోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తల్లిని ముద్దు పెట్టుకున్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఈ పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి 2020లో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌లో చిరుకు ప్రస్తుతం 1.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఖాతా ఓపెన్ చేసి ఏడాదే అయినా.. ఫాలోవర్లు మాత్రం బాగానే ఉన్నారు. ఇక రామ్ చరణ్‌కు 2 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. వరుణ్ తేజ్‌కు 3.2, సాయి ధరమ్ తేజ్‌కు 2.6 ఫాలోవర్లు ఉన్నారు. ఇక చిరు మేనల్లుడు అల్లు అర్జున్‌కు ఏకంగా 6.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఆచార్య సినిమమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటించారు. మరోవైపు రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.
Also Read: IPL 2022 New Rules: డీఆర్ఎస్, సూపర్ ఓవర్‌లో కీలక మార్పు.. ఐపీఎల్ 2022 నయా రూల్స్ ఇవే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook