Mem Famous vs 2018: మొదటి రోజు రచ్చ రేపిన మేం ఫేమస్, 2018.. ఎన్ని కోట్లు వసూలు చేశాయంటే?
2018 Telugu Day 1 Collections: ఈ శుక్రవారం నాడు అనేక సినిమాలు రిలీజ్ అయినా రెండు సినిమాలు మాత్రమే తెలుగు ప్రేక్షకులు అటెన్షన్ ని గ్రాబ్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే
Mem Famous 1st Day Collections: మే 26వ తేదీన పలు ఆసక్తికరమైన సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. అందరూ కొత్త వాళ్లే కలిసి చేసిన మేం ఫేమస్, మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 2018 తెలుగు రిలీజ్ తో పాటు పవిత్ర లోకేష్, నరేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి, మగవాళ్ళ సమస్యలను చూపించే మెన్ టూ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అదే విధంగా చాలా కాలం తర్వాత పూర్తిస్థాయిలో బ్లాక్ అండ్ వైట్ సినిమాగా రుపొందిన గ్రే కూడా రిలీజ్ అయింది.
అయితే ఈ అన్నింటిలో రెండు సినిమాలు మాత్రమే తెలుగు ప్రేక్షకులు అటెన్షన్ ని గ్రాబ్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. అదే మేం ఫేమస్, 2018. మేం ఫేమస్ అనే సినిమా ఒక లో బడ్జెట్ సినిమా. అందరూ కొత్త వాళ్లే కావడం ఈ సినిమాకు కొంత మైనస్. అయితే అందరూ కొత్త వాళ్లే కావడంతో బడ్జెట్ కూడా తక్కువే అయింది. రైటర్ పద్మభూషణ్, మేజర్ లాంటి సినిమాలను నిర్పించిన చాయ్ బిస్కెట్ ఫిలింస్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది.
Also Read: Malli Pelli: భారీ బడ్జెట్ తో మళ్లీ పెళ్లి.. పెద్ద దెబ్బే పడిందే?
ఈ సినిమా యూత్ అందరినీ ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ నేపద్యంలో మొదటి రోజు ఈ సినిమాకు మంచి వసూళ్లయితే నమోదయ్యాయి. ఇక సమ్మర్ సెలవులు కూడా ఉండడంతో పాటు శని ఆదివారాలు కలిసి రావడంతో ఈ సినిమా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సుమంత్ ప్రభాస్ నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మహేష్ బాబు మెచ్చడంతో ఆయన అభిమానులు కూడా నెత్తిన పెట్టేసుకుంటున్నారు. మరోపక్క 2018 సినిమా కూడా తెలుగులో మంచి వసూళ్లు రాబడుతోంది. ఇక మేం ఫేమస్ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 50 లక్షల షేర్ కోటి పది లక్షల గ్రాస్ వసూలు చేస్తే 2018 మాత్రం 46 లక్షల షేర్ కోటి రెండు లక్షల గ్రాస్ వసూలు చేసింది. దాదాపుగా ఈ రెండు కూడా రెండు కోట్లలోపు బిజినెస్ జరుపుకోవడంతో ఆ బడ్జెట్ వెనక్కి వచ్చేయడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది.
Also Read: Dhanush Hathavid: స్టార్ హీరోయిన్ కోసం రంగంలోకి ధనుష్.. హతవిధీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK