Men and Maggi lasts for 2 minutes says Regina Cassandra: సాధారణంగా సినీ సెలెబ్రిటీలు మరీ ముఖ్యంగా హీరోయిన్లు డబుల్ మీనింగ్ డైలాగ్స్ జోలికి అసలు వెళ్లరు. కానీ నలుగురిదీ ఒకదారైతే తనది ఒకదారి అంటూ రెజీనా గతంలో కూడా కొన్ని డబ్బులు డైలాగ్స్ మాట్లాడి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆమె శాకినీ డాకినీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. నివేదా థామస్ తో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా కాలం తరువాత ఆమె నటించిన సినిమా త్వరలో రిలీజ్ అవుతూ ఉండడంతో ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. కేవలం ఇంటర్వ్యూలకే పరిమితం కాకుండా తమకు నచ్చినవి తింటూ ఫుడ్ చానల్స్ లో కూడా సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు సినీ నటులు. అలాగే తెలుగు ఫుడ్ ఛానల్ ఒకదానిలో శాకినీ డాకినీ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు రెజీనా కసాండ్రా, నివేదా థామస్. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ అబ్బాయిల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.


ఆమె మాట్లాడుతూ మ్యాగీ అలాగే అబ్బాయిలు రెండు నిమిషాల్లోనే అయిపోతారు అంటూ ఆమె కామెంట్ చేసింది. ముందు ఆమె చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్ అర్థం కాకపోవడంతో సదరు యాంకర్ నిజమే నిజమే అని అనడంతో మీకు జోక్ అర్థం కాలేదు అనుకుంటా అంటూ ఆమె కామెంట్ చేసింది. తరువాత సదరు యాంకర్ కి బల్బ్ వెళ్ళడంతో నోరు వెళ్ళబెట్టాడు. ఇదంతా తింటూ గమనిస్తున్న నివేదా థామస్ నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నం చేసింది.


అయితే ఏ విషయంలో రెండు నిమిషాలు అనేది రెజీనా విశదీకరించి చెప్పలేదు కానీ పరోక్షంగా అబ్బాయిల శృంగార సామర్థ్యం మీదే రెజీనా కామెంట్ చేసిందని నెటిజన్లు భావిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొరియాలో సూపర్ హిట్ గా నిలిచిన ఒక సినిమాని తెలుగులో శాకినీ డాకినీ అనే పేరుతో రీమేక్ చేశారు దర్శకుడు సుధీర్ వర్మ. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సురేష్ బాబు, సునీత తాటి ఈ సినిమాని నిర్మించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. తెలుగులో అనేక సినిమాల్లో నటించిన రెజీనా కసాండ్రా హిట్టు అందుకుని అయితే చాలా కాలమైంది. సరైన హిట్ సినిమా కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది.


Also Read: Chiranjeevi Watched God Gather: గాడ్ ఫాదర్ వీక్షించిన చిరంజీవి.. డైరెక్టర్ పై షాకింగ్ రియాక్షన్!


Also Read: Brahmastram review: బ్రహ్మాస్త్రం మూవీ ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి