Piyush Goyal Interesting Comments on RRR: దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. సినిమా విడుదల అయ్యి పదిరోజులు అవుతున్నా.. కనక వర్షం కురిపిస్తుండడంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.  దేశ వ్యాప్తంగా విడుదల అయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి 750 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం బాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమాలని తొక్కుకుంటూ.. 200 కోట్లు వసూళ్ళ దిశగా దూసుకుపోతుంది. అలాగే మిగిలిన భాషల్లోనూ ఆర్.ఆర్.ఆర్ సత్తా చాటుకుంటోంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఎందరో సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆకాశానికెత్తేశారు. 


కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఆర్.ఆర్.ఆర్ చిత్రం దేశంలోనే అతి పెద్ద సినిమా అని కొనియాడారు. ఇప్పటి వరకు 750 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. త్వరలో 1000 కోట్ల క్లబ్‌కు చేరబోతుందని సినీ ప్రముఖులు చెప్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా మాదిరిగానే.. భారత ఆర్ధిక వ్యవస్థ కూడా మోడీ నాయకత్వంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోందంటూ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి పీయుష్ గోయల్ వ్యాఖ్యలకు ఆర్.ఆర్.ఆర్  టీం ధన్యవాదాలు తెలిపింది. దేశ అభివృద్ధిలో భాగమైనందుకు సంతోషిస్తున్నామని  ఆర్.ఆర్.ఆర్ టీం ట్వీట్ చేసింది.    



ఇక సినిమా విషయానికి వస్తే.. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటించగా.. కొమరంభీంగా ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ గత శుక్రవారం (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా రిలీజై ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి షో నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ రావడంతో.. భారత దేశంతో పాటు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మొదటి రోజే రూ.223 కోట్లు రాబట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇప్పటివరకు దాదాపుగా రూ. 750 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. 


Also Read: Janhvi Kapoor Photos: షైనింగ్ డ్రస్సులో వజ్రంలా మెరిసిపోతున్న నటి జాన్వీ కపూర్!


Also Read: Sai Pallavi Farming: కూలీగా మారిన 'శ్యామ్ సింగరాయ్' మూవీ హీరోయిన్ - ఫొటోలు వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook