Ala Ninnu Cheri: `అలా నిన్ను చేరి` నుంచి `కొడిపాయే లచ్చమ్మది..` పాట వచ్చేసింది.. రిలీజ్ చేసిన మంత్రి తలసాని
Ala Ninnu Cheri Movie: హెబ్బా పటేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం `అలా నిన్ను చేరి`. తాజాగా ఈ మూవీ నుంచి కోడిపాయే లచ్చమ్మది సాంగ్ ను మంత్రి తలసాని యాదవ్ రిలీజ్ చేశారు.
Ala Ninnu Cheri Movie Song: యంగ్ హీరో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం 'అలా నిన్ను చేరి'. ఈ సినిమాతో ఆడియన్స్‌కు ఓ సరికొత్త అనుభూతిని ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీతో మారేష్ శివన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఇప్పటికే రిలీజైన టైటిల్ సాంగ్ అందరినీ అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి కోడిపాయే లచ్చమ్మది సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మాస్ బీట్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రిలీజ్ చేశారు. మంగ్లీ పాడిన ఈ పాట కుర్రకారుని ఓ ఊపు ఊపుతోంది. సుభాష్ ఆనంద్ అందించిన బాణీలు ఆకట్టుకున్నాయి. భాను కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ లిరికల్ వీడియోలో హెబ్బా పటేల్ అందాలు, నటన, డ్యాన్స్ అంతా కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి.
పాటను రిలీజ్ చేసిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ.. ‘''యంగ్ టీం అంతా కలిసి ఈ సినిమాను నిర్మించారు. యంగ్ టాలెంట్‌ను ప్రేక్షకులు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. కొత్త సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. యంగ్ టాలెంట్ టీం తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ మూవీపెద్ద విజయం సాధించాలి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’'' అని అన్నారు.
కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అలా నిన్ను చేరి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో అన్ని పాటలు కూడా ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయడం విశేషం. చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా.. ఐ ఆండ్రూ కెమెరామెన్‌గా, కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పని చేశారు. ఈ చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదర్ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అతి త్వరలో ఈ మూవీ విడుదల తేదిని దర్శక నిర్మాతలు ప్రకటించనున్నారు.
Also Read: Chandramukhi 2 Collection: చంద్రముఖి 2 ఫస్ట్ డే కలెక్షన్స్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి