Mirzapur Actor Shahnawaz Pradhan Died మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో ఎస్పీ పరుశురామ్ గుప్తా పాత్రలో నటించిన షెహ్నావాజ్ ప్రధాన్ (56) నేడు కన్నుమూశారు. అవార్డు ఫంక్షన్‌కు హాజరైన ఆయన ఒక్కసారిగా చాతిలో నొప్పి రావడంతో కుప్పకూలి పోయారు. వెంటనే కొకిలాబెన్ హాస్పిటల్‌కు తరలించారు. కానీ అంతలోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో హీరోయిన్ల తండ్రిగా నటించిన షెహ్నావాజ్ ప్రధాన్.. ఈ వెబ్ సిరీస్‌తో నేషనల్ వైడ్‌గా క్రేజ్ దక్కించుకున్నాడు. అంతకు ముందు ఆయన రాయిస్, పాంథోమ్, 24, బ్యోంకేష్‌ భక్షి వంటి వాటిలో నటించి మెప్పించాడు.


ఆయనతో కలిసి నటించిన నటుడు రాజేష్ తైలాంగ్ ఎమోషనల్ అయ్యాడు. ఆయనకు నా చివరి వందనాలివే.. ఇంకా ఇలా ఎంత మందిని తీసుకెళ్తావ్.. మీతో కలిసి పని చేసిన ఆనంద క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అంటూ సంతాపాన్ని ప్రకటించాడు.


మీర్జాపూర్ వెబ్ సిరీస్‌ ఫస్ట్ సీజన్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. ఈ సిరీస్‌కు వచ్చిన క్రేజ్ చూసి ఇండియన్ సినీ ఇండస్ట్రీ షాక్ అయింది. మరీ ముఖ్యంగా మున్నా భాయ్ డైలాగ్స్, క్రేజ్, యాటిట్యూడ్ ఇలా అన్నీ కూడా యూత్‌లో బాగా ఎక్కేశాయి. మున్నా భాయ్‌ మీద వచ్చినన్నీ మీమ్స్, ట్రోల్స్ మిగతా ఏ ఇతర నటుల మీద కూడా రాలేదు. మీర్జాపూర్ ఫస్ట్ సీజన్ హిట్ అవ్వడంతో రెండో సీజన్‌ను తీశారు. కానీ అది అంతగా క్లిక్ అవ్వలేదు.


Also Read:  vinaro bhagyamu vishnu katha Review : వినరో భాగ్యము విష్ణు కథ రివ్యూ.. కిరణ్ అబ్బవరం పాస్ అయ్యాడోచ్


Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook