Mithilesh Chaturvedi: బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ నటుడు హఠాన్మరణం
Mithilesh Chaturvedi Passed Away : ప్రముఖ హిందీ నటుడు మిథిలేష్ మిథిలేష్ చతుర్వేది కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన అల్లుడు ప్రకటించారు.
Mithilesh Chaturvedi Passed Away : బాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్ సినిమాల్లో నైటీనిచ్చే ప్రముఖ నటుడు మిథిలేష్ చతుర్వేది కన్నుమూశారు. మిథిలేష్ చతుర్వేది బుధవారం నాడు అంటే ఆగస్టు 3న తుది శ్వాస విడిచారు. మిథిలేష్ గత కొన్ని రోజులుగా గుండె సంబంధింత సమస్యలతో పోరాడుతున్నారు. కానీ చివరికి ఆయన పోరాటం విఫలమై కన్నుమూశారు. ఇక ఆయన మరణవార్తతో బాలీడువ్ సినీ పరిశ్రమ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. బాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం, నటుడు మిథిలేష్ చతుర్వేది గత కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక ఈక్రమంలోనే ఆయన చికిత్స కూడా తీసుకుంటున్నారు.
గత కొన్నాళ్ల క్రితమే ఆయన తన స్వగ్రామం లక్నోలో స్థిరపడ్డారు. అయితే నిన్న ఆగస్టు 3న ఆయనకు గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ విషయాన్ని ఆయన అల్లుడు ఆశిష్ చతుర్వేది ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. ఆశిష్ చతుర్వేది మిథిలేష్ చతుర్వేది ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో “మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ తండ్రి. నన్ను అల్లుడులా కాకుండా కొడుకులా ప్రేమించారు,. దేవుడు మీ ఆత్మకు శాంతిని కలుగజేయుగాక” అని పేర్కొన్నారు.
ఈ సినిమాల్లో నటించారు:
మిథిలేష్ మరణ వార్త తెలియగానే సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. తన కెరీర్‌లో, మిథిలేష్ చతుర్వేది మంచి బాలీవుడ్ సినిమాల్లో నటించారు. ఆయన సన్నీ డియోల్ నటించిన 'గదర్: ఏక్ ప్రేమ్ కథ', మనోజ్ బాజ్‌పేయి 'సత్య', 'తాల్', 'బంటీ ఔర్ బబ్లీ', అలాగే 'క్రిష్' 'రెడీ'తో సహా షారుఖ్ ఖాన్ 'అశోక'లో కూడా నటించారు. కానీ 'కోయి... మిల్ గయా' సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కంప్యూటర్ టీచర్ పాత్రలో ఆయన నటించాడు.
Also Read: Har Ghar Tiranga Song: ప్రభాస్, కీర్తి సురేష్, దేవిశ్రీల ‘హర్ ఘర్ తిరంగా’ సాంగ్.. చూశారా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook