Mithun Chakraborty : కేంద్ర ప్రభుత్వం ప్రతి యేడాది సినీ రంగానికి సేవలు అందించిన సంబంధించి అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సినీ రంగానికి సంబంధించిన వ్యక్తిని గౌరవిస్తూ వస్తుంది. 2022 యేడాదికి గాను ప్రముఖ బెంగాలీ, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రబర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది.  త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈయన ఋ అవార్డు అందుకోనున్నారు. ఈ అవార్డు అందుకోబోతున్న 54వ వ్యక్తి మిథున్ చక్రబర్తి. మిథున్ చక్రబర్తి విషయానికొస్తే.. భారతీయ చిత్ర పరిశ్రమలో ఫస్ట్ సినిమాతో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న కథానాయకుడిగా రికార్డులకు ఎక్కాడు. బెంగాలి సినిమా నుంచి తన సినీ ప్రస్థానం షురూ చేసి.. బాలీవుడ్‌ స్టార్ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 'డిస్కో డాన్సర్', డాన్స్ డాన్స్ సినిమాలతో చరిత్ర సృష్టించాడు. ఈ సినిమాలు తెలుగులోనే కాదు.. రష్యాలో కూడా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికీ రష్యాలో ఈ సినిమాలకు ప్రత్యేక అభిమానులున్నారు. 80వ దశకంలో బాలీవుడ్ లో తన డాన్సులతో  అమ్మాయిలతో పాటు యావద్దేశ ప్రజానీకం మనసులను చూరగొన్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ మాస్ యాక్షన్ చిత్రాల హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యేడాదే కేంద్రం ఈయన్ని పద్మభూషణ్ తో గౌరవించింది. ఇపుడు ఈయన కీర్తి కిరీటంలో అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చి చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథున్ చక్రబర్తి సినిమా కెరీర్ విషయానికొస్తే.. సినిమా కష్టాలు.. సినిమా కష్టాలు అంటారుగా.. అలాగే మిథున్ తాను హీరో కావడానికి ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు.  నిద్ర లేని రాత్రులు గడిపాడు.  పుట్‌పాత్ మీద పడుకున్న సందర్భాలున్నాయి. అంతేకాదు కథానాయకుడు  కావాలన్న తన డ్రీమ్ నెరవేరదేమో అనుకొని ఒకానొక సందర్భంలో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు.  ఒక రకంగా మిథున్ చక్రబర్తి జీవితం ఎగుడు దిగుడులతో అష్టవంకరలుగా సాగి చివరకు ఓ మలుపు తీసుకుంది.   అంది వచ్చిన అవకాశాలను పుచ్చుకొని హీరోగా బాలీవుడ్ చిత్ర సీమలో చెలరేగిపోయారు.


మిథున్ చక్రబర్తి  అసలు పేరు గౌరంగ చక్రబర్తి. సినిమాల్లో మిథున్ చక్రబర్తిగా పేరు మార్చుకున్నాడు. ఈయన జూన్ 16  1950 పశ్చిమ బంగా రాజధాని కోల్‌కతాలో జన్మించారు. సినిమా ఛాన్సుల కోసం ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసిన ఈయన 1976లో మృణాల్ సేన్ డైరెక్షన్ లో  తెరకెక్కిన 'మృగయ' చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీతోనే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన కెరీర్ అంత సాఫీగా ముందుకు సాగలేదు.  1982లో విడుదలైన 'డిస్క్ డాన్సర్' సినిమాతో మిథున్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాలోని ఈయన నటన, డాన్సింగ్ కు మిథున్ కు తిరుగులేని స్టార్ డమ్ తీసుకొచ్చాయి. మొత్తంగా బాలీవుడ్‌లోనే కాదు.. మన దేశంలోనే తొలి డాన్సింగ్ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు.  అప్పట్లో చిరు సైతం ఆయన లా డాన్సులు చేయడం తన వల్ల కాదు అంటూ కామెంట్స్ చేయడం విశేషం. డిస్కో డాన్సర్ మూవీ అప్పట్లో సోవియట్ యూనియన్‌లో ప్రదర్శితమైంది.


ఆ తర్వాత డాన్స్ డాన్స్,   వాంటెడ్, బాక్సర్, కసమ్ పైదా కర్నే వాలేకి, సురక్ష, ప్రేమ్ ప్రతిజ్క్ష,  ముజ్రిమ్, అగ్నిపథ్, హమ్ పాంచ్, సాహస్, వార్దాత్, శౌకీన్,అవినాశ్,నసిహత్, వక్త్ కీ ఆవాజ్,  రావణ్ రాజ్, జల్లాద్ వంటి చిత్రాలు ఈయనకు పేరు తీసుకొచ్చాయి. ఒకపుడు వరుస హిట్స్‌తో  చెలరేగిపోయాయి. ఆ తర్వాత వరుస ఫ్లాపులు కూడా ఈయన కెరీర్ ను డైలామాలో పడేసాయి.  హీరోగా ఫేడౌట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటించారు.  ఆపై కొన్ని టీవీ షోల్లో జడ్జ్‌గా వ్యవహరించారు. ఇక 2014లో ఈయన తృణముల్ కాంగ్రెస్‌తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.  అదే యేడాది మమతా బెనర్జీ.. మిథున్‌ను రాజ్యసభకు పంపించారు. ఆ తర్వాత 2016లో ఈయన పార్టీ  సభ్యత్వానికి రాజ్యసభ కు రాజీనామా చేసిన భారతీయ జనతా పార్టీ లో చేరారు. . ఇక జాతీయ ఉత్తమ నటుడిగా 'మృగయ'తో పాటు 'తానేదార్ కి కథ సినిమాలకు నేషనల్ అవార్డులు  అందుకున్నారు. అటు స్వామి వివేకనంద సినిమాలోని రామకృష్ణ పరమహంసగా నటించి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకోవడం విశేషం. ఈయన తెలుగు సినిమాలతో మంచి అనుబంధమే ఉంది. తెలుగులో వెంకటేష్, వపన్ కళ్యాణ్‌ హీరోలుగా నటించిన 'గోపాల గోపాల' సినిమాతో పాటు మలుపు చిత్రాల్లో నటించారు. ఏది ఏమైనా ఒకప్పటి సూపర్ స్టార్‌కు సినీ రంగంలో అత్యున్న  అవార్డుతో గౌరవించడంపై ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.