MM Keeravani Mother Bhanumathi Passed Away: ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రాజమౌళి సోదరుడు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తల్లి భానుమతి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ప్రముఖ గేయ రచయిత శివశక్తి దత్తా భార్య అయిన ఆమె కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో కిమ్స్ హాస్పిటల్లో రాజమౌళి కుటుంబ సభ్యులు చేర్పించినట్లుగా తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు రోజులుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న కీరవాణి తల్లి ఆర్యోగ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఇక మరికాసేపట్లో రాజమౌళి నివాసానికి ఆమె మృతదేహాన్ని తరలించనున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సోదరుడే ఈ శివశక్తి దత్తా. నిజానికి గతంలో విజయేంద్ర ప్రసాద్ శివశక్తి దత్తా కలిసి రచనలు చేసేవారు.


తర్వాత కాలంలో విజయేంద్ర ప్రసాద్ ఎక్కువగా సినిమాలకు కథలు అందిస్తూ వస్తున్నా శివశక్తి దత్తా అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇంటికే పరిమితం అయ్యారు. ఇక కీరవాణి తండ్రి శివ శక్తి దత్త ఇంటికే పరిమితం అయినా పలు పాటలు రాస్తూ, సినిమాలకు కథలు అందిస్తూ వస్తున్నారు. మరోపక్క కీరవాణి తమ్ముడు కల్యాణి మాలిక్, సోదరి ఎంఎం శ్రీలేఖ కూడా సంగీత దర్శకులుగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో రాణిస్తున్నారు.


కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఆయన సోదరుడు శ్రీసింహా హీరోగా రాణిస్తున్నారు. కీరవాణి బాబాయ్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, ఆయన కుమారుడైన రాజమౌళి ఆ కుటుంబ గౌరవాన్ని మాత్రమే కాదు తెలుగు వారందరి గౌరవాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. 
Also Read: RGV Hug Girl Siri Stazie: ఆర్జీవీని హగ్గడిగి సెలబ్రిటీ అయిపోయిన సిరి స్టేజీ.. అమ్మడు మామూలు హాట్ కాదండోయ్!


Also Read: Nikhi Sidharth Remuneration : రెమ్యూనరేషన్ పెంచిన నిఖిల్.. అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook