ప్రఖ్యాత సంగీత దర్శకుడు మరియు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ "ది ఫ్లయింగ్ లోటస్" పేరుతో ఓ కొత్త ఆల్బమ్‌ను విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ఆల్బమ్‌లో రిచార్డో ఆవేర్బాచ్‌ మార్గదర్శకత్వంలో రెహమాన్ పాడిన 19 నిమిషాల వ్యవధి కలిగిన పాట సీటెల్‌ సింఫోనీ ఆర్కెస్ట్రా మ్యూజిక్‌ కంపోజిషన్‌తో రూపొందించబడింది.


అయితే విశేషమేమిటంటే, ఇదే ఆల్బమ్‌లో డీమానిటైజేషన్ అంశానికి సంబంధించి భారత ప్రధాని మాట్లాడిన పదాలు కూడా చోటుచేసుకున్నాయట. ఇటీవలే యూనివర్శిల్‌ మ్యూజిక్‌ గ్రూప్‌ ఇండియా మరియు సౌత్‌ ఆసియా సీఈవో దేవరాజ్‌ సన్యాల్‌ ఈ ఆల్బమ్ గురించి మాట్లాడుతూ ఇది ఒక వినూత్నమైన ప్రయత్నమని అభిప్రాయపడ్డారు.


అలాగే ఏ ఆర్ రెహమాన్ మాట్లాడుతూ "భారత ప్రధాని నరేంద్ర మోడీ డీమానిటైజేషన్ అంశం మీద చేసిన ప్రకటన ఒక చరిత్రనే మార్చింది. దీని మీద సానుకూల, ప్రతికూల అభిప్రాయాలు కూడా ఉండచ్చు. అయితే ఒక చారిత్రక అంశాన్ని మా పాట ద్వారా నమోదు చేసినందుకు ఆనందంగా ఉంది"  అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా యూనివర్శల్‌ మ్యూజిక్‌ గ్రూప్‌‌లో అందుబాటులో ఉంది.