Actress Anjali Pavan : బుల్లితెర నటీనటులకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై నిత్యం కనిపిస్తూ.. సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటూ మరింత క్రేజ్ పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మరో ఎంటర్టైన్మెంట్ షోను ప్రారంభించారు. మిస్టర్ అండ్ మిసెస్ అనే ఈ షోలో పది జంటలను తీసుకువచ్చారు. ఇందులో అంజలి పవన్ కూడా ఒక జంటగా ఆట ఆడుతోంది. ఈ షోకు అనిల్ రావిపూడి, స్నేహ, శివ బాలాజీ వంటి జడ్జ్‌లుగా వచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు ఈ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి వైరల్ అవుతోంది. అందులో అంజలి పవన్ చివర్లో అందరినీ ఏడిపించేసింది. మొగలి రేకులు సీరియల్‌తో నటి అంజలి పవన్‌కు మంచి క్రేజ్ వచ్చింది. అడపాదడపా చిత్రాలు, సీరియల్‌లు చేస్తూ మంచి ఇమేజ్ దక్కించుకుంది. అయితే ఈ మధ్య మాత్రం అంజలి పవన్ యూట్యూబ్ చానెల్ ద్వారా మరింతగా హాట్ టాపిక్ అవుతోంది.


నటి అంజలి  తన కూతురు ధన్వికతో, తన భర్త పవన్‌తో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఇన్ స్టాగ్రాంలో సందడి చేస్తుంటుంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ జంటగా మిస్టర్ అండ్ మిసెస్ షోలో పాల్గొన్నారు. అక్కడ అంజలి తన పర్సనల్ విషయాలను పంచుకుంది. అందరి ముందే ఎమోషనల్ అయింది. స్టేజ్ మీదే కంటతడి పెట్టేసుకుంది.


 



తనకు అమ్మ మాత్రమే ఉందని, నాన్న లేరని చెబుతూ.. మంచి అబ్బాయి రావాలని, నా జీవితాంతం వదిలి పెట్టకుండా చూసుకోవాలి అని అనుకున్నా.. జీవితాంతం నాతో ఉండు అంటూ అంజలి అందరి ముందే కంటతడి పెట్టేసుకుంది. దీంతో అంజలి భర్త పవన్ మాటిచ్చేశాడు. నువ్ చెప్పిన మాటలను నేను చెప్పలేను.. కానీ అంతకంటే ఎక్కువగా చూసుకుంటాను.. ఒట్టేసి చెబుతున్నా అంటూ పవన్ చెప్పిన మాటలకు అంజలి ఎమోషనల్ అయింది. ఏడిపించేశావ్ చీ పోరా అని రాకింగ్ రాకేష్ వేసిన జోక్‌కు అంజలి నవ్వేసింది.


మొత్తానికి ఈ ప్రోమో మాత్రం ఎమోషనల్ అండ్ ఫన్ టోన్‌లో సాగింది. ఈ మిస్టర్ అండ్ మిసెస్ షో, పది జంటలతో నడిపించే ఈ కార్యక్రమం గత వారం గ్రాండ్‌గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రతీ మంగళవారం ఈ షోను ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే.


Also Read : Sardar Movie Telugu Review: 'సర్దార్'గా రచ్చ రేపిన కార్తీ.. సినిమా ఎలా ఉందంటే?


Also Read : Prince Movie Review : ప్రిన్స్ రివ్యూ.. నో లాజిక్ ఓన్లీ కామెడీ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook