Mohan Babu Praises on Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకు పరిచయం అక్కర్లేదు. భారత సినీ చరిత్రలో చిరంజీవి కంటూ ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. 80, 90వ దశకంలో తన స్టెప్పులు, గ్రేసుతో అన్ని ఇండస్ట్రీల జనాలను ఉర్రూతలూగించేశాడు. నాలుగు దశాబ్దాలకు పైగా చిరంజీవి తన ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించనుండి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) కార్యక్రమంలో చిరంజీవికి ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియా అనే అవార్డును ప్రకటించారు. ఇది వరకు ఈ అవార్డును రజినీ, అమితాబ్, ఇళయరాజా, ఎస్పీబీ వంటి వారికి ప్రకటించారు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అయితే తెలుగు నుంచి ఈ ఘనతను చిరంజీవి సాధించడంతో టాలీవుడ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాజాగా మంచు వారు ట్విట్టర్ వేదికగా స్పందించారు. చిరంజీవిని ప్రశంసించారు. మోహన్ బాబు ఈ మేరకు ట్వీట్ వేస్తూ.. నా ప్రియమైన చిరంజీవిని గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌లో ఇలాంటి సత్కారం లభించబోతోన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.. కంగ్రాట్స్.. ఆ షిర్డీ సాయి బాబా ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలి అంటూ కోరాడు.


 



శ్రీ చిరంజీవి గారికి ఇలాంటి గౌరవం లభిస్తున్నందుకు చిరంజీవి గారికి కంగ్రాట్స్.. ఇది మన తెలుగు చిత్ర సీమకు ఎంతో గర్వకారణం అంటూ మంచు విష్ణు ట్వీట్ వేశాడు. అయితే మంచు వారికి మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న వైరం గురించి అందరికీ తెలిసిందే. మంచు వర్సెస్ మెగా మధ్య ప్రేమ ఎంత ఉందో.. దూరం కూడా అంతే ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. అయితే మా ఎన్నికల సమయంలోనే ఈ విబేధాలు మరింత ఎక్కువగా అయినట్టు కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు పరోక్ష కామెంట్లు చేసుకుంటూ ఉన్నట్టు కనిపిస్తోంది.


ఇలా చిరంజీవి మీద మోహన్ బాబు, మంచు విష్ణు స్పందించడంపైనా నెటిజన్లు భిన్న రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు మంచు వారి మీద సెటైర్లు వేస్తూ ఉంటే.. ఇంకొందరు మాత్రం ఇప్పటికైనా స్పందించారు నయం అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Also Read : Ruhani Sharma - Akanksha singh : హగ్స్ చేసుకున్నాం.. ముద్దులు పెట్టుకున్నాం!.. రుహానీ, ఆకాంక్షలు తేడాగా ఉన్నారే?


Also Read : Mahesh Babu Wig: మహేష్ విగ్గు రహస్యం బట్టబయలు.. అసలు విషయం బయటపెట్టిన మేకప్ మ్యాన్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook