Mohan babu missing rumours goes viral: మోహన్ బాబు ఇంటి తగాదా ఆయనకు లేని సమస్యను తెచ్చిపెట్టినట్లు తెలుస్తొంది. ఆయన  ఫ్యామీలీ గొడవ కంటే కూడా.. మీడియా ప్రతినిధిపైన దాడి కేసుపైన ఫోకస్ పెట్టారంట. కానీ ఇటీవల ఆయన తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కోట్టేసింది. ఆయనను.. ఈ నెల 24 వరకు పోలీసుల ఎదుట హజరు నుంచి హైకోర్టు మినహాయించి విషయం తెలిసిందే .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ హైకోర్టు ఆయనను అరెస్ట్ చేయోద్దని మాత్రం ఎలాంటి రిలాక్సెషన్ ఇవ్వలేదు. దీంతో ఆయనకు ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని భయం చుట్టుకుందంట. మరొవైపు.. ఆయన దుబాయ్ కు కూడా వెళ్లిపోయారని వార్తలు జోరుగా వస్తున్నాయి. మోహన్ బాబు తన కొడుకు మనోజ్ తో ఇంటి గొడవలు కాస్త రోడ్డుమీద పడ్డాయని చెప్పుకొవచ్చు. జల్ పల్లి వద్ద గత వారంలో అనేక నాటకీయ పరిణామలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.


అదే విధంగా మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, మోహన్ బాబు.. కమిషనర్ కు ఫిర్యాదులు చేయడం వంటి ఘటనలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. వీరి గొడవలు కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు.. మైక్ పట్టుకుని బలంగా దాడిచేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా.. ఆయనకు ఇటీవల సర్జరీ కూడా జరిగింది. అదే విధంగా ప్రస్తుతం.. ఆయనపై పోలీసులు కేసుల్ని సైతం నమోదు చేశారు.


ఈ క్రమంలో కోర్టు మద్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఆయనను ఏ సమయంలో అయిన అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఆయన కన్పించడంలేదని ప్రచారం జరిగింది. కానీ మోహన్ బాబు తాను ఇంట్లో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఫెక్ ప్రచారం మానుకొవాలని ఎక్స్ వేదికగా స్పందిచారు.


Read more: Mohan Babu: మోహన్ బాబు టాయ్ లెట్‌లో చేతులు పెడతారు..!.. షాకింగ్ విషయం బైటపెట్టిన బెల్లంకొండ సురేష్..


మరీ ఇప్పుడు మాత్రం ఆయన ఇప్పటి వరకు స్పందించినట్లు లేదు. మోహన్ బాబువిషయంలో పోలీసుల ప్రవర్తనను కూడా.. కొంత మంది డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారంట. బెయిల్ రద్దుకాగానే.. అరెస్ట్ చేయకుండా... ఇంకా కాలయాపన ఎందుకు చేస్తున్నారనిన ఫైర్ అవుతున్నారంట. రాజకీయంగా కూడా.. మోహన్ బాబు పోలీసుల్ని ప్రభావితం చేస్తున్నాడని.. కొంత మంది అంటున్ననట్లు సమాచారం. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter