Mohan Babu: మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట..
Mohan Babu: మోహన్ బాబు తన కుటుంబ గొడవలు రచ్చ కెక్కిన సంగతి తెలిసిందే కదా. చిన్న కుమారుడు మంచు మనోజ్ తో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో మోహన్ బాబు ప్రముఖ టీవీ జర్నలిస్ట్ పై దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఆయన పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ కేసులో బెయిల్ కోసం మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. తాజాగా అక్కడ ఆయనకు భారీ ఊరట లభించింది.
Mohan Babu: జర్నలిస్ట్ రంజిత్ పై దాడి కేసులో తెలంగాణ పోలీసులు మోహన్ బాబు పై హత్యా యత్నం సహా పలు కేసులు దాఖలు చేశారు. దీంతో ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఉండడాని పెదరాయుడు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కానీ తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు బెయిల్ ను తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మోహన్ బాబుకు ఊరటనిస్తూ తీర్పు ఇచ్చింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించని మోహన్ బాబు. ఈ నేపథ్యంలో ఈ రోజు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆయన తరుపున ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం మోహన్ బాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు నిచ్చింది. నెక్ట్స్ కోర్టు విచారణ వరకు ఆయన పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు ఈ విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఈ విషయంలో మూడు వారాల్లో కౌంటర్ దాలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.
మోహన్ బాబుకు తన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య ఆస్తులకు సంబంధించిన గొడవల నేపథ్యంలో రచ్చ కెక్కారు. ఈ సందర్బంగా మోహన్ బాబు ఇంట్లో ఇరు వర్గాలకు చెందిన బౌన్సర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ గొడవల్లో మోహన్ బాబు ప్రముఖ ఛానెల్ కు చెందిన రిపోర్టర్ ను గట్టిగా కొట్టడంతో ఆయన హాస్పిటల్ పాలయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు మోహన్ బాబు పై కేసు నమోదు చేసారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.