Mohanlal Akshay Kumar Dance : మోహన్ లాల్, అక్షయ్ కుమార్ స్టెప్పులు.. పెళ్లిలో స్టార్ హీరోల సందడి
Mohanlal And Akshay Kumar Dance మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఓ పెళ్లిలో కలిసి చిందులు వేశారు. వీటికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామన్ ఫ్రెండ్ పెళ్లిలో ఇలా చిందులు వేసినట్టుగా కనిపిస్తోంది.
Mohanlal And Akshay Kumar Dance వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా అండ్ స్టార్ ఇండియా ప్రెసిడెంట్ కే మాధవన్ కొడుకు గౌతమ్ మాధవన్ పెళ్లిలో సౌత్, నార్త్ ఇండస్ట్రీల సెలెబ్రిటీలు కలిసి కనిపించారు. ఈ పెళ్లి వేడుకల్లోనే అక్షయ్ కుమార్, మోహన్ లాల్‌లు కలిసి చిందులు వేశారు. ఈ ఇద్దరూ భల్లె భల్లె అంటూ స్టెప్పులు వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గురువారం నాడు జైపూర్‌లోని కోటలో ఈ పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకల్లో ఆమిర్ ఖాన్, కమల్ హాసన్, మోహన్ లాల్, కరణ్ జోహర్, పృథ్వీరాజ్ సుకుమారన్, అక్షయ్ కుమార్ ఇలా అందరూ కనిపించారు. వీరంతా కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాతో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి.
ఇక ఈ పెళ్లిలో మోహన్ లాల్, తాను కలిసి వేసిన స్టెప్పులకు సంబంధించిన వీడియోను అక్షయ్ కుమార్ షేర్ చేశాడు. ఇలా మోహన్ లాల్ సర్‌తో కలిసి వేసిన స్టెప్పులు, ఆ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను.. ఇవి నాకు ఎంతో గొప్ప మెమోరీస్‌గా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు.
ఇలా అక్షయ్ కుమార్‌తో కలిసి కాలు కదపడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అది కూడా నా ప్రియమైన గౌతమ్ మాధవన్ పెళ్లి వేడుకల్లో జైపూర్‌లో ఇలా స్టెప్పులు వేయడం సంతోషంగా ఉంది అని మోహన్ లాల్ ట్వీట్ వేశాడు.
ఇక కరణ్ జోహర్ అయితే మోహన్ లాల్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని, ఇది తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని మురిసిపోయాడు. ఇద్దరం కలిసి ఒకే ఫ్లైట్‌లో పెళ్లికి వెళ్లామని చెప్పుకొచ్చాడు.
Also Read: Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే
Also Read: SSMB 28 Look : మహేష్ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి