Mokshagna-Jr NTR: బాలకృష్ణ కొడుకు మోక్షాజ్ఞ సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తారా అంటూ.. నందమూరి అభిమానులే కాదు.. తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూశారు. ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ వేచి చూస్తున్న ఈ కళ.. నిన్న సెప్టెంబర్ 6న నెరవేరింది. మోక్షజ్ఞ 30వ పుట్టినరోజు సందర్భంగా.. అతని మొదటి సినిమా ప్రకటించారు నందమూరి ఫ్యామిలీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఆ సినిమాతో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని.. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ చేతిలో.. మోక్షజ్ఞ బాధ్యతలు అప్పగించారు బాలకృష్ణ. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ చిత్రం కూడా భాగం కావడం విశేషం. ఇక ఈ సినిమా పోస్టర్ విడుదలైన దగ్గర నుంచి.. ఈ చిత్రం గురించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్.. తెగ వినిపిస్తోంది. 


మోక్షజ్ఞ.. మొదటి సినిమా కోసం బాలకృష్ణ పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. తాను దగ్గరుంది బాధ్యతలు తీసుకోవడమే కాకుండా ఈ చిత్రం కోసం ఎంతో మంది సెలబ్రిటీస్ ని రంగంలోకి దించనున్నారట. నందమూరి వారసుడు సినిమా అలా ఇలా ఉంటే ఎలా అన్నట్టు.. ఈ సినిమాలో భారీ గెస్ట్ ఆపియరెన్సెస్ ఉండబోతున్నాయని టాక్. ముఖ్యంగా బాలకృష్ణ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు అని వినికిరి. ఇక మరోవైపు హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా మోక్షజ్ఞ సినిమాలో ఒక స్పెషల్ రోల్  లో కనిపించబోతున్నారని వినిపిస్తోంది. పాన్‌ ఇండియా లెవెల్‌లో వస్తున్న ఈ సినిమా కథాంశం సోషియో ఫాంటసీ అంటున్నారు. ఇందులో భాగంగా బాలకృష్ణ  శ్రీకృష్ణుడి పాత్ర పోషించబోతున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ కి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. అతన్ని కూడా ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించడానికి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.


ఇక మోక్షాజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా.. తన మొదటి సినిమా పోస్టర్ షేర్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య గొడవలు ఉన్నాయి అని ఇప్పటికి ప్రచారంలో ఉన్న.. మోక్షాజ్ఞ సినిమా వల్ల వీరిద్దరూ కలవబోతున్నారు అని మాటలు వినిపిస్తున్నాయి. మరి తమ్ముడు మోక్షాజ్ఞ సినీ కెరియర్ కోసం.. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి.


Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..!


Also Read: Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.