Bharateeyudu 2 Ticket Rates: భారీ అంచనాల మధ్య.. జూన్ 27న విడుదలైన కల్కి సినిమా ఇప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్.. వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈవారం కూడా పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు.. ఏమీ రిలీజ్ అవ్వకపోవడంతో కల్కి సినిమాకి.. అది చాలా బాగా వర్క్ అవుట్ అయింది. కలెక్షన్లు కూడా ఏమాత్రం తక్కుముఖం పట్టడం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇప్పటికే ఈ సినిమాని చూసేసిన ప్రేక్షకులు.. అందరూ భారతీయుడు 2.. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటిదాకా కల్కి హవానే నడిచింది కానీ.. ఇంక ఈ సినిమా కాకుండా మరి ఏమైనా సినిమా.. చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులందరికీ.. భారతీయుడు 2 త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. 


సినిమా యావరేజ్ గా ఉంది అని టాక్ వచ్చినా.. కూడా ఎలాగో ఈ మధ్యకాలంలో ఇంకేమీ సినిమా చూడలేదు అని అయినా.. భారతీయుడు 2.. సినిమాకి వస్తారు ప్రేక్షకులు. నిజానికి ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు అయితే లేవు. కాబట్టి సినిమా యవరేజ్ గా ఉన్న పాజిటివ్ టాక్ రావచ్చు. అది ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్.. అయ్యే అవకాశాలు ఉన్నాయి. 


మరోవైపు భారతీయుడు 2.. సినిమాకి పెద్ద కాంపిటేషన్ కూడా ఏమీ లేదు. ప్రియదర్శి నటించిన డార్లింగ్ సినిమా తప్ప.. మరే సినిమా కూడా విడుదల కావడం లేదు. దీంతో సినిమా కొంచెం.. బాగుంది అని టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు భారీ స్థాయిలో.. ఉంటాయి. అయితే సినిమా రన్ టైం మూడు గంటల నాలుగు నిమిషాలు. 


ఇది మాత్రమే సినిమాకి మైనస్ పాయింట్.. అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక చిత్ర బృందావనం సినిమా ప్రమోషన్స్ మీద బాగానే దృష్టి పెట్టింది. చెన్నై నుంచి ముంబైదాకా.. సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఏపీ తెలంగాణలో.. సినిమా టికెట్ మీద 50 రూపాయలు.. హైక్ ఇవ్వమని అడుగుదామని నిర్మాత ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 


కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో.. సినిమాపై ఉన్న అంచనాలు బాగా తక్కువ. ఇలాంటి సమయంలో సినిమా టికెట్ రేట్.. పెంచడం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.  సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, బ్రహ్మానందం, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవి చందర్.. ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.


Also Read: కాంగ్రెస్ లో నరాలు తేగే ఉత్కంఠ.. రేపే మంత్రి వర్గ విస్తరణ..?.. ఆషాడం ఎఫెక్ట్..


Also Read:​ డిప్యూటీ సీఎం పేరు చెప్పి రైతు సూసైడ్.. భట్టీకి చెక్ పెట్టేదిశగా పావులంటూ జోరుగా చర్చలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి