Kalki First Review: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కల్కి 2898AD సినిమా.. మీద అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి. రోజులు దగ్గరపడే కొద్దీ.. సినిమా చూడాలని అభిమానులు.. కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య.. ఈ సినిమా.. జూన్ 27న థియేటర్లలో విడుదల కాబోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న.. ఈ సినిమాలో ఆల్రెడీ చాలా మంది స్టార్ నటీనటులు.. ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అన్ని భాషల నుంచి స్టార్లు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే, దిశా పటాని, బ్రహ్మానందం, తదితరులు.. సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. 


ఒకప్పటి స్టార్ హీరోయిన్.. శోభన కూడా చాలాకాలం తర్వాత మళ్లీ ఈ సినిమాలో.. మంచి పాత్రలో కనిపించబోతున్నారు. ఇవన్నీ చాలవు అన్నట్లు.. చాలా మంది స్టార్లు.. ఈ సినిమాలో చిన్న చిన్న కామియో పాత్రలలో కూడా కనిపించబోతున్నారట. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఏకంగా 25 కు మందికి పైగా.. స్టార్లు కామియో పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 


ఇంతమంది స్టార్లను.. ఒకేసారి వెండి తెర మీద చూడటం ప్రేక్షకులకు కచ్చితంగా… కన్నులవిందుగా మారబోతోంది. ఈ వార్త ఇప్పుడు..సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ స్టార్లు ఎవరు అని తెలుసుకోవడానికి… అభిమానులు చాలా ఎక్సైట్ అవుతున్నారు. 


నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లు ఈ చిత్రంలో.. క్యామియో పాత్రలలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు విన్నాం. మరి వీళ్ళు మాత్రమే కాకుండా.. సినిమాలో ఇంకేంతమంది.. ఎలాంటి పాత్రలలో కనిపించబోతున్నారు అని తెలియాల్సి ఉంది. 


వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి.. సంతోష్ నారాయణ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి 600 కోట్ల భారీ బడ్జెట్ తో మాత్రమే కాక తారాగణం తో కూడా ఈ సినిమా తెరకెక్కనుంది.


Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో


Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి