Aha OTT: ఆహా ఓటీటీలో సందడి చేయనున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’..స్ట్రీమింగ్ ఎప్పుడంటే...
Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా..బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ మూవీ ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఎప్పటి నుంచంటే...
Most Eligible Bachelor: రొమాంటిక్ లవ్‌స్టోరీతో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’(Most Eligible Bachelor). అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా..పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటించింది. అయితే కరోనా పరిస్థితులను సైతం తట్టుకొని ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో సినిమా లాభాలతోనే బిజినెస్ ముగిసింది. అఖిల్(Akhil Akkineni) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
Also Read: Mahasamudram OTT Release: నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న శర్వానంద్, సిద్ధార్థ్ ‘మహాసముద్రం’ మూవీ
తాజాగా ఈ సినిమా ఓటీటీ(OTT)లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. గీతాఆర్ట్స్-2 బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీ(Aha OTT) వేదికగా విడుదల చేయనున్నట్లు ఆహా యాజమాన్యం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా స్ట్రీమింగ్ తేదీ(Streaming Date)ని అధికారికంగా ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాన్ని నవంబర్ 19న ఆహాలో విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఆహాతో పాటు నెట్‌ఫ్లిక్స్(Netflix)లో కూడా విడుదల చేస్తుండడం విశేషం. మరి బిగ్ స్క్రీన్‌పై వండర్స్ క్రియేట్ చేసి అఖిల్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమా డిజిటల్ స్క్రీన్‌పై ఎలాంటి అద్భుతం చేస్తుందో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook