చనిపోయిన పిల్ల ఏనుగును లేపేందుకు తల్లి హృదయం పాట్లు.. కన్నీళ్లు తెప్పించే వీడియో
వివిధ సందర్భాల్లో ఏనుగులు స్పందించే తీరు ఎలా ఉంటుందనేది మీరు అనేక వీడియోల్లో చూసే ఉంటారు. ఏనుగులకు ఆగ్రహం వస్తే విధ్వంసం సృష్టిస్తాయి. వాటి కళ్లకు కనిపించిన ప్రతీ దాన్ని తొక్కిపారేస్తాయి. అటు ఇటు దొర్లించేస్తాయి. అడ్డొస్తే మనుషులనైనా తొక్కి చంపుతాయి. అలాగే వాటికి కోపం రాకుండా సాధారణంగా ఉన్నప్పుడైతే.. మనుషులతో మమేకమైపోతాయి.
వివిధ సందర్భాల్లో ఏనుగులు స్పందించే తీరు ఎలా ఉంటుందనేది మీరు అనేక వీడియోల్లో చూసే ఉంటారు. ఏనుగులకు ఆగ్రహం వస్తే విధ్వంసం సృష్టిస్తాయి. వాటి కళ్లకు కనిపించిన ప్రతీ దాన్ని తొక్కిపారేస్తాయి. అటు ఇటు దొర్లించేస్తాయి. అడ్డొస్తే మనుషులనైనా తొక్కి చంపుతాయి. అలాగే వాటికి కోపం రాకుండా సాధారణంగా ఉన్నప్పుడైతే.. మనుషులతో మమేకమైపోతాయి. మనిషి చెప్పినట్టుగా నడుచుకుంటాయి. తమ మంచి చెడులు చూసుకునే వారికి, తమకు నచ్చిన మనిషికి కష్టం వస్తే... తమకే కష్టం వచ్చినంత ఫీలవుతాయి. కొన్నిసందర్భాల్లో ఏనుగులు కన్నీళ్లు కార్చడం కూడా చూడొచ్చు. అలాంటి వీడియోనే ఇది కూడా. ఈ వీడియో చూస్తే.. ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి.
మూడేళ్ల ఏనుగు పిల్ల చనిపోయింది. ఏనుగు పిల్ల ఏ చలనం లేకుండా పడి ఉండటం చూసిన తల్లి ఏనుగు హృదయం తల్లడిల్లిపోయింది. పిల్లను తట్టి లేపే ప్రయత్నం చేసింది. అటు ఇటు కదిలిస్తే లేచి కూర్చుంటుందేమోనని కదిలించి చూసింది. పిల్ల ఏనుగులో ఏ కదలిక లేకపోవడంతో ఏమీ చేయలేక నిస్సహాయతతో, నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోవడం వీడియోలో చూడొచ్చు.
Also read : వైరల్ పిక్: పడగవిప్పిన మూడు పాములు.. ఆశీర్వాదం అనుకో అంటున్న ఐఎఫ్ఎస్ ఆఫీసర్
కేరళలోని పలక్కడ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైతు బోరు మోటారుకు పెట్టిన విద్యుత్ వైర్ తగిలి విద్యుదాఘాతంతో ఏనుగు చనిపోయినట్టు అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఏనుగు హృదయం (గజరాజు ఆగ్రహం) తల్లడిల్లిన తీరు చూసి నెటిజెన్స్ సైతం కన్నీటి పర్యంతం అవుతున్నారు. అనుబంధం, మాతృత్వం, తల్లి హృదయం ఏ జీవికైనా ఒకటే విధంగా ఉంటుందని ఈ తల్లి ఏనుగు నిరూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also read: ఆరోగ్యం కోసం ఆవు పేడ తింటున్న డాక్టర్ వీడియో వైరల్.. నెటిజెన్స్ ఏమంటున్నారంటే..
Also read : వైరల్ వీడియో: పారాసైలింగ్ చేస్తుండగా తాడు తెగి గాల్లోంచి సముద్రంలో పడిన జంట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook