Kanchana 4 update: కొరియోగ్రాఫర్ గా, హీరోగా, డైరెక్టర్ గా కూడా మంచి పేరు ఉన్న రాఘవ లారెన్స్ హీరోగా.. 2011 లో స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా కాంచ‌న‌. తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా భారీ విజ‌యాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే కాంచన 2, కాంచన 3 అంటూ.. మరొక రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ లు కాకపోయినా.. బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేశాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఇప్పుడు ఈ సిరీస్ లో మరొక భాగాన్ని.. అనౌన్స్ చేశారు రాఘవ లారెన్స్. కాంచన 4 కూడా రాబోతోంది అని చిత్ర బృందం ఇప్పటికే ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసి మరీ ప్రకటించింది. ఈ సినిమాకి కూడా లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. చిత్ర షూటింగ్‌ కూడా సెప్టెంబ‌ర్‌ నుండి.. సెట్స్ మీదకి వెళ్ళబోతోంది అని కూడా పోస్టర్ లోనే తెలిపారు. 


షూటింగ్ త్వరగా పూర్తి చేసి.. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ సినిమాని భారీ స్థాయిలో విడుద‌ల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంచన సిరీస్ లో రాయ్ ల‌క్ష్మీ, వేదిక, నిత్యా మీనన్, తాప్సీ పన్నులు హీరోయిన్లుగా నటించారు. దీంతో కాంచ‌న 4లో ఎవ‌రు హీరోయిన్‌గా న‌టిస్తారు అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 


తాజా సమాచారం ప్రకారం కాంచన 4 లో రాఘవ లారెన్స్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించనుంది.. అని వార్తలు వినిపిస్తున్నాయి. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నాని సరసన హాయ్ నాన్న సినిమాతో కూడా మరొక హిట్ అందుకున్న మృణాల్ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫ్లాప్ అందుకుంది.


తాజాగా ఇప్పుడు ఈమె ఎంట్రీతో కాంచన 4 సినిమా మీద.. మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆమె అభిమానులు మాత్రం కెరియర్ మంచిగా వెళుతున్న సమయంలో లారెన్స్ పక్కన హీరోయిన్ గా అవసరమా.. అంటూ కంగారు పడుతున్నారు. మరి ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్ర ఎలా ఉండబోతుంది, సినిమాలో ఈమె పాత్ర తో ప్రేక్షకులను భయపెడుతుందా లేదా.. తెలియాలంటే సినిమా కోసం మరి కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.


Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..


Read more; Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter