బాలీవుడ్ నటుడు ( Bollywood actor ) సుశాంత్ సింగ్ మరణ వ్యవహారం రోజురోజుకూ అనేక మలుపులు తిరుగుతోంది. ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పుడీ కేసులో ముంబై పోలీసులు పెద్ద విషయాల్నే దాచుతున్నారని సుశాంత్ న్యాయవాది ఆరోపించడం సంచలనమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput death episode ) మరణ వ్యవహారం కేసు ఇప్పుడు సీబీఐ దర్యాప్తు ( CBI Probe ) లో ఉంది. అనూహ్య మలుపులతో  నిండి ఉన్న కేసులో డ్రగ్స్ మాఫియా హస్తం కూడా బయటపడింది. సుశాంత్  కు డ్రగ్స్ ఇచ్చేవారని...రియా చక్రవర్తి ( Rhea Chakroborty ) స్వయంగా డ్రగ్స్ డీల్ చేసేదనే విషయం వెలుగుచూసింది. ఈ వ్యవహారమంతా వాట్సప్ చాట్ ద్వారా బయటపడింది. సుశాంత్ కేసులో ఇప్పటికే ఈడీ, సీబీఐలు విచారణ జరుపుతున్నాయి. డ్రగ్స్ డీల్ విషయం బయటపడటంతో ఇప్పుడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ( NCB ) రంగంలో దిగింది. బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియాపై ఎన్ సీ బీ ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్ డీలర్ కైజన్ ఇబ్రహీంను అదుపులో తీసుకున్నారు. రియా సోదరుడిని అరెస్టు చేసి..అతనిచ్చిన సమాచారం మేరకు సుశాంత్ మేనేజర్ శామ్యూల్ ఇంట్లో దాడులు నిర్వహించారు. 


మరోవైపు సుశాంత్ సింగ్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ( Vikas singh ) ఈ కేసులో సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. ఎన్ సీ బీ అరెస్టుల్ని చూస్తుంటే...ముంబైై పోలీసులు ఈ కేసులో పెద్ద విషయాల్నే దాచినట్టు అన్పిస్తోందని ఆరోపించాడు. కేసులో ఎన్నో మలుపులు చోటుచేసుకోవడం బట్టి చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నాడు. ఏదో జరగరానిదే జరిగిందనే సందేహం వస్తోందంటున్నారు. Also read: Sanjjana Garlani: డ్రగ్ డీలర్స్‌తో సంబంధాలు వార్తలపై స్పందించిన సంజన