Kalki2898AD Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. భారీ స్టార్ క్యాస్ట్ తో జూన్ 27న భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్యాన్ ఇండియా రేంజ్ సినిమా కాబట్టి..అదే రేంజ్ లో ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే సినిమాలో ప్రభాస్ నటిస్తున్న భైరవ పాత్రను, రోబోటిక్ కార్ బుజ్జి పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తూ.  ఒక చిన్న వెబ్ సిరీస్ ని.. కూడా విడుదల చేశారు. ఇప్పటికే అది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. 


తాజాగా ఇప్పుడు అందులో చూపించిన రోబోటిక్ కార్ బుజ్జిని రియల్ గా తీసుకొని వచ్చి.. ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, చెన్నైలో హల్చల్ చేసిన ఈ కార్ ఇప్పుడు ముంబైలోని.. జూహూ బీచ్ లో ఉంది. బాలీవుడ్లో కూడా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో అశ్వద్ధామ పాత్రలో కనిపించనున్నారు. 


ఈ నేపథ్యంలోనే ముంబైలో కూడా బుజ్జి క్రేజ్ భారీగానే ఉంది. తాజాగా బుజ్జి కార్ ఎక్కి.. ముంబై పోలీస్ ఆఫీసర్ ఒకరు ఫోటోలు దిగారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ముంబై పోలీసుల చేతికి చిక్కిన బుజ్జి అంటూ ఈ వార్త ఇండస్ట్రీ మొత్తం మారు మృోగుతోంది. 


 



బుజ్జి కార్ ను డ్రైవ్ చేస్తూ ముంబై పోలీస్ నవ్వుతూ కనిపించారు. ప్రభాస్ తో పాటు బుజ్జి క్రేజ్ కూడా నార్త్ ఇండియాలో బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. పైగా బుజ్జి పాత్రకి సినిమాలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ డంబింగ్ చెప్పారు. దీంతో ఆ పాత్ర మీద మరింత హైప్ పెరిగింది. సినిమాలో బుజ్జి, భైరవ అడ్వెంచర్స్ చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇక దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్, దిశా పటాని, బ్రహ్మానందం కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.


Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..


Read more; Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter