Murali Mohan comments on Nandi Awards: హైదరాబాద్: తెలంగాణ సర్కారుతో పాటు ఏపీ సర్కారుపై ప్రముఖ సినీనటుడు, జయభేరీ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత మురళీ మోహన్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినీనటులకు అవార్డులు ఆక్సిజన్‌ లాంటివని.. కానీ ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా అవార్డులు పక్కనబెట్టాయని మురళీ మోహన్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదికల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది సినిమా పురస్కారాల వేడుకలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో 24 విభాగాలకు చెందిన సినీ ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. స్టూడియో సెక్టార్‌ నుంచి రమేష్ ప్రసాద్‌కు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని పక్కన పెట్టాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఏడేళ్ల నుంచి ఇప్పటివరకు అసలు నంది అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టలేదన్నారు. 



ప్రభుత్వాలు అందించే అవార్డులు సినిమా వాళ్లకు టానిక్ లాంటివని.. సంపాదించిన డబ్బు ఏమైందో పట్టించుకోం కానీ ప్రభుత్వాలు అందించే అవార్డులు చూసి మురిసిపోతుంటాం అని తెలిపారు. తమ తర్వాతి తరం వారికి కూడా ఆ అవార్డులు చూపించుకుని గర్వపడుతుంటామని చెబుతూ.. ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రైవేటు సంస్థలు మాత్రమే నటీనటులకు అవార్డులు ఇస్తున్నాయని మురళీ మోహన్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి నటుడు బ్రహ్మానందం, నిర్మాత సి.కల్యాణ్ తదితరులు హాజరయ్యారు.


Also read : Tiger Nageswara Rao: రవితేజ కొత్త సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'.. లాంచ్ చేసిన చిరంజీవి


Also read : Rajamouli - Mahesh Babu: మహేష్‌తో సినిమాపై రాజమౌళి చెప్పిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్... షూటింగ్ ఎప్పుడంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook