Devi Sri Prasad about f3 movie : వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్ లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన 'ఎఫ్3 ' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఎఫ్3 సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నారు. ఎఫ్ 2తర్వాత ఇంత హాయిగా నవ్వుకున్న సినిమా ఎఫ్ 3అనే అని సెన్సార్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమౌతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా f3 చిత్ర సంగీత దర్శకుడు రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తాజాగా ఎఫ్3 చిత్ర విశేషాలు పంచుకున్నారు. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారని, ఇది మాత్రం గ్యారెంటీ అని అన్నారు. మూవీ ఆర్ఆర్ చేస్తూ పడిపడి నవ్వుకున్నానన్నారు. నవ్వినవ్వి పొట్ట చెక్కలైపోయేంత హిలేరియస్‌గా ఎఫ్3 చిత్రం ఉంటుందన్నారు. జంధ్యాల, ఈవీవీ గారు ఎంత చక్కగా హాస్యం పండించేవారో ..అలాంటి ఆరోగ్యకరమైన హాస్యం ఎఫ్3లో ఉందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారన్నారు. ఇందులో ఎంటర్ టైన్మెంట్ తో పాటు సందేశం కూడా చాలా గొప్పగా ఉంటుందన్నారు. 


ఎఫ్2లో ఎక్కువ సిట్యుయేషనల్ సాంగ్స్ ఉన్నాయని.. ఎఫ్3లో సిట్యుయేషనల్ పాటలే కాకుండా జనరల్‌గా కనెక్ట్ అయ్యే సాంగ్స్ చేశామని తెలిపారు. లబ్ డబ్ డబ్బు, లైఫ్ అంటే ఇట్లా ఉండాలా పాటలు కథలో భాగమవుతూనే అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాన్నారు డీఎస్పీ. లబ్ డబ్ డబ్బుకు సూపర్ రెస్పాన్స్ వచ్చిందని.. ఉ ఆహా.. లైఫ్ అంటే ఇట్లా ఉండాలా.. పాటలు కూడా చాలా కొత్తగా ఉన్నాయని ఆడియన్స్ ఫీలయ్యారన్నారు.  అన్నిటికంటే దర్శకుడు అనిల్ రావిపూడి గారు సినిమా రీరికార్డింగ్ అంతా చూసి.. అద్భుతంగా చేశారు. మీకు "వంద హగ్గులు వంద ముద్దులు'' అన్నారని.. దర్శకుడు ఆ మాట చెప్పడం చాలా ఆనందాన్నిచ్చిందని దేవీ శ్రీ అన్నారు.


Also Read - Allu Arjun Dowry: అ‍ల్లు అర్జున్‌ ఎంత కట్నం తీసుకున్నారంటే.. అసలు విషయం చెప్పేసిన స్నేహా రెడ్డి తండ్రి!


Also Read - Jr NTR Birthday: జూనియర్ ఎన్టీఆర్‌ని చంద్రబాబు, బాలకృష్ణ పూర్తిగా పక్కకు పెట్టేశారా ? రుజువు ఇదేనా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook