Hi Nanna Update: `మ్యూజికల్ జర్నీ స్టార్ట్` అంటున్న నాని.. వైరల్ అవుతున్న వీడియో..
Hi Nanna: నేచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `హాయ్ నాన్న`. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అయింది హాయ్ నాన్న టీమ్. తాజాగా వీడియో కూడా రిలీజ్ చేసింది.
Hi Nanna Update: నేచురల్ స్టార్ నాని నయా మూవీ 'హాయ్ నాన్న'(Hi Nanna). ఇది నానికి 30వ సినిమా. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకుర్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబి కైరా ఖన్నా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో శ్రుతిహాసన్ కీ రోల్ పోషిస్తోంది. దసరా సినిమా సూపర్ హిట్ తర్వాత నాని నుంచి వస్తున్న మూవీ కావడంతో సినిమాపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. జెర్సీ సినిమా తర్వాత మరోసారి తండ్రిపాత్రలో కనిపించనున్నాడు నాని.
కొన్ని రోజులగా ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతుంది. గత కొద్ది రోజులగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో నాని ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే తాజాగా ఈ మూవీ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ మూవీ మ్యూజికల్ జర్నీ స్టార్ చేయబోతున్నట్లు తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు నాని. ఇందులో సముద్రపు అలల సవ్వడి మధ్య నాని, మృణాళ్ ఠాకూర్ ఒకరినొకరు చూసుకుంటూ, కళ్ళతోనే సైగలు చేసుకుంటూ ప్రేమించుకుంటూ కనిపించారు. దీని బట్టి చూస్తే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని షేర్ చేసిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
'హాయ్ నాన్న' చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నారు. 'ఖుషి' వంటి సూపర్ హిట్ ఆల్బమ్ తర్వాత నాని సినిమాకి కూడా అదే రేంజ్ లో మ్యూజిక్ ఇవ్వనున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ప్రముఖ టీ- సిరీస్ సంస్థ ఈ మూవీ మ్యూజికల్ రైట్స్ ను దక్కించుకుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. వైరా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (CVM), విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: Gadar 2 OTT Release Date: ఓటీటీలోకి 'గదర్ 2'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook