Anasuya Bharadwaj: హలో.. నా వయసు 40 కాదు 36 మాత్రమే! జర్నలిస్ట్‌పై అనసూయ ఫైర్!!
Anasuya slams Journalist: తాజాగా ఓ వెబ్ సైట్ అనసూయ భరద్వాజ్ వయసుని తప్పుగా ప్రచారం చేయగా.. అందుకు తన ట్విట్టర్ ఖాతాలో జర్నలిస్ట్‌పై ఫైర్ అయ్యారు.
Anchor Anasuya Bharadwaj slams Journalist: ఈటీవీ కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా అనసూయ భరద్వాజ్ బుల్లితెరకు పరిచయం అయ్యారు. తన యాంకరింగ్, అందంతో ఆనతి కాలంలోనే పాపులర్ అయ్యారు. టాప్ యాంకర్ అయిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా దూసుకుపోతున్నారు. వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. క్షణం, రంగస్థలం, పుష్ప సినిమాలతో తనలోని నటనకు కూడా బయటకు తీశారు. అనసూయకు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.
అనసూయ భరద్వాజ్ ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతివారం ప్రసారమయ్యే 'జబర్దస్త్' షో కోసం అను రకరకాల డ్రెసులతో పాటు చీర కట్టులోనూ మెరుస్తుంటారు. అందుకు సంబందించిన పోటోలను తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో పంచుకుంటారు. ఆ ఫొటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వాటికి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.
తన పోటోల కారణంగా అనసూయకు సోషల్ మీడియాలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. తనపై ట్రోల్స్ వస్తే మాత్రం.. అను ఘాటుగా బదులిస్తూ ఉంటారు. తన గురించి ఎలాంటి తప్పుడు ప్రచారం జరిగినా.. అస్సలు సహింరు. వెంటనే స్పందించి ఘాటుగా రిప్లై ఇస్తుంటారు. ఇటీవల తన డ్రెస్సింగ్ స్టైల్‌పై సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ కామెంట్ చేయగా.. ఆయనకు ధీటుగానే బదులిచ్చారు. తాజాగా ఓ వెబ్ సైట్ అనసూయ వయసుని తప్పుగా ప్రచారం చేయగా.. అందుకు తన ట్విట్టర్ ఖాతాలో జర్నలిస్ట్‌పై ఫైర్ అయ్యారు.
అనసూయ భరద్వాజ్ తాజా ఫోటోలపై ఓ ప్రత్యేకం కథనం రాసిన జర్నలిస్ట్.. 'వైట్ శారీలో దేవకన్యలా ఉన్న అనసూయ..ఫోటో వైరల్' అనే టైటిల్ ఇచ్చారు. 'ముద్దుగుమ్మ అనసూయ అందాల ఆరబోతకు వెనకడుగు వెయ్యధు.. అయితే అను వయస్సు 40 ఏళ్లు దాటినా,, ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆమె అందాల ముందు అవి ఎవరికీ గుర్తుకు రావు' అని పేర్కొన్నారు. ఇది చుసిన అనసూయ ఆగ్రహానికి గురయ్యారు. నా వయసు 40 కాదు 36 మాత్రమే అని ఘాటుగా రిప్లై ఇచ్చారు.
'హలో సాత్విక (ఆర్టికల్ జర్నలిస్ట్) నాకు 40 కాదు కేవలం 36. వయసు పెరగడం సాధారణమే. నా వయసు విషయంలో ఎప్పుడూ సిగ్గుపడను. నేను ఎప్పుడు అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తాను. ఈ విషయంలో హామీ కూడా ఇస్తున్నాను. కానీ మీ లాంటి జర్నలిస్టులు మీ వృత్తిని న్యాయంగా, నిజాయితీగా చేయండి. జర్నలిజం ఓ ఆయుధం. మంచి పనులకు ఉపగించండి. గుడ్ లక్' అని అనసూయ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.
Also Read: Chinna Jeeyar Swamy: సీఎం కేసీఆర్‌తో విభేదాలపై చినజీయర్ స్వామి రియాక్షన్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook