Samantha Completes 12 Years in Film Industry: సమంత.. సినీ అభిమానులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2010లో అందమైన ప్రేమకథతో తెరకెక్కిన 'ఏమాయ చేశావే' సినిమాతో సామ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. మొదటి సినిమాలోనే తన అందం, నటనతో కుర్రకారు మనసును దోచుకున్నారు. ఆ సినిమాలో నాగ చైతన్య, సమంత జోడి అందరిని ఆకట్టుకుంది. 'ఏమాయ చేశావే' భారీ హిట్ కొట్టడంతో సమంతకు వరుస ఆఫర్లు వచ్చాయి. అనతి కాలంలోనే అగ్రహీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి సినిమానే బంపర్ హిట్ కొట్టడంతో సమంత తెలుగులో వెనదిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ ఆమెకు బోలెడు ఆఫర్లు వస్తున్నాయి. ఏ మాయా చేసావె, దూకుడు, ఈగ, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బృందావనం, మనం, ఏటో వెళ్ళిపోయింది మనసు, సన్ ఆఫ్ సత్యమూర్తి, అ ఆ, అత్తారింటికి దారేది, రంగస్థలం, జనతా గ్యారేజ్, ఓ బేబి, మజిలీ, మహానటి, జాను, యూ టర్న్ లాంటి హిట్ సినిమాలు సామ్ ఖాతాలో ఉన్నాయి. తమిళంలో కూడా సమంత భారీ విజయాలు అందుకున్నారు. అక్కడ సూర్య, విక్రమ్, విజయ్, విశాల్ లాంటి టాప్ హీరోలతో జతకట్టారు. 


సమంత సినీ ఇండస్ట్రీకి వచ్చి నేటికి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే ఓ విషయం గ్రహించా. నేను సినీ ఇండస్ట్రీలో 12 సంవత్సరాలు పూర్తయింది. లైట్లు, కెమెరా, యాక్షన్ అంటూ సాగిన ఈ 12 సంవత్సరాల జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇంత గొప్ప ప్రయాణంలో ప్రపంచంలోని  అత్యుత్తమ మరియు అత్యంత నమ్మకమైన అభిమానులను కలిగి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమాతో నా ప్రేమ కథ ఎప్పటికీ ముగియదు. ఇకపై కూడా ఇదే విధంగా నా ప్రయాణం కొనసాగుతుందని ఆశిస్తున్నా' అని సామ్ పేర్కొన్నారు.



సమంత సినీ కెరీర్ బాగానే సాగినా.. పర్సనల్ లైఫ్ మాత్రం ఆశించిన మేర లేదు. మొదటి మూవీ హీరో అక్కినేని నాగ చైతన్యతోనే ప్రేమలో పడ్డ సామ్.. చాలా ఏళ్లుగా ఆ ప్రేమను ఆస్వాదించారు. పెళ్లితో ఒక్కటైన సామ్-చై ఆరంభంలో బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. పెళ్లి బంధం ఎక్కువకాలం కొనసాగలేదు. గత ఏడాది అక్టోబర్ 2న వీరు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరు ఏ కారణంతో విడిపోయారని విషయం ఇప్పటికి ఓ పెద్ద మిస్టరీనే. 


Also Read: Leander Paes Rhea Pillai: మోడల్‌తో లివ్‌ఇన్ రిలేషన్‌.. దోషిగా తేలిన లియాండర్ పేస్!!


Also Read: Bheemla Nayak: భీమ్లా నాయక్​ పాటకు థియేటర్లో స్టెప్పులేసిన తమన్​..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook