Ajith Kumar - Good Bad Ugli: తెలుగులో భారీ రేటుకు అమ్ముడు పోయిన అజిత్ కుమార్ `గుడ్ బ్యాడ్ అగ్లీ` మూవీ.. ఫస్ట్ లుక్కు సూపర్ రెస్పాన్స్..
Ajith Kumar - Good Bad Ugli: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీకి `గుడ్ బ్యాడ్ అగ్లీ` అనే టైటిల్ కన్ఫామ్ చేశారు. తాజాగా ఈ సినిమా తెలుగు రైట్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ రేటుకు సొంతం చేసుకుంది.
Ajith Kumar - Good Bad Ugli: అజిత్ కుమార్ హిట్ ఫ్లాపులకు సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది. తెలుగులో కనీవినీ ఎగరని భారీ రేటుకు ఈ సినిమా తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఇటివలే హైదరాబాద్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టైటిల్ కి తగ్గట్టు అజిత్ ని మూడు డిఫరెంట్ వేరియేషన్స్ లో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో అజిత్ మూడు పాత్రల్లో కనిపించున్నారా..! ఒకటే వ్యక్తి మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌లో నటిస్తున్నాడా అని తెలియాల్సి ఉంది. ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అభినందన్ రామానుజం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. విజయ్ వేలుకుట్టి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ ఎపుడేనేది మాత్రం వెల్లడించలేదు.
తారాగణం: అజిత్
సాంకేతిక సిబ్బంది
రచన & దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అభినందన్ రామానుజం
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
ప్రొడక్షన్ డిజైనర్: జి ఎం శేఖర్
స్టంట్స్: సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్
స్టైలిస్ట్: అను వర్ధన్ / రాజేష్ కమర్సు
పీఆర్వో: సురేష్ చంద్ర
పీఆర్వో (తెలుగు) : వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మార్కెటింగ్ (తమిళం) : డి'వన్
సౌండ్ డిజైన్: సురేన్
స్టిల్స్ : జి ఆనంద్ కుమార్
పబ్లిసిటీ డిజైన్స్: ADFX స్టూడియో
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ నరసింహన్
సిఈవో: చెర్రీ
నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై రవిశంకర్
అజిత్ విషయానికొస్తే.. 2022లో తెగింపు మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత ఈయన నుంచి వస్తోన్న సినిమా ఇదే కావడంతో అభిమానులు ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి