Ram Charan Buchi Babu Project : మైత్రీ మూవీస్‌లో మళ్లీ గొడవలు.. అతని వల్ల రామ్ చరణ్ సినిమా క్యాన్సిల్?
Mythri Movie Makers Issue మైత్రీ మూవీస్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ. పుష్పతో నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయింది. ఇక ఇప్పుడు అందులో గొడవలు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది.
Ram Charan Buchi Babu Project : మైత్రీ మూవీస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, బాలయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇలా స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేస్తూనే ఉంది. అయితే మైత్రీలో మొదటి నుంచి కొన్ని గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మొదట్లో ముగ్గురు స్నేహితులు కలిసి మైత్రిని ప్రారంభించారు. ఆ తరువాత అందులోంచి ఓ వ్యక్తి పక్కకి వెళ్లిపోయాడు. ఏవో పెద్ద స్థాయిలో గొడవలు జరిగాయని అప్పట్లో టాక్ వచ్చింది. రవి శంకర్, నవీన్ మాత్రమే మైత్రీని నడిపిస్తూ వచ్చారు.
ఇప్పుడు మళ్లీ మైత్రీలో గొడవలు జరిగాయని తెలుస్తోంది. ఇన్నాళ్లు మైత్రీని బ్యాక్ బోన్‌లా ఉండి నడిపించిన ఓ వ్యక్తి బయటకు వచ్చాడట. దీంతో రామ్ చరణ్ బుబ్చిబాబు ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీస్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందట. అలా ఇప్పుడుఈ ప్రాజెక్ట్ మైత్రీ మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కడం లేదట. యూవీ క్రియేషన్స్ చేతికి ఈ చిత్రం వెళ్లిందని తెలుస్తోంది.
అయితే ఇలా ఎందుకు జరిగిందనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే ఉప్పెన సినిమాతో దర్శకుడిగా బుచ్చిబాబుకు మైత్రీనే చాన్స్ ఇచ్చింది. ఇక రామ్ చరణతో రంగస్థలం సినిమాను తీసింది. అలా ఇద్దరితోనూ మైత్రికి మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ ఒక్క వ్యక్తి వల్ల మాత్రం ఇప్పుడు అన్నీ మారిపోయాయని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ రానుందని సమాచారం.
ఎన్టీఆర్‌కు చెప్పిన స్పోర్ట్స్ డ్రామానే ఇప్పుడు రామ్ చరణతో బుచ్చిబాబు తీస్తున్నాడని టాక్. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుందని, సంక్రాంతి తరువాత షూటింగ్ చేస్తారని సమాచారం. ఎన్టీఆర్‌తో బుచ్చిబాబు సినిమా క్యాన్సిల్ అవ్వడానికి కూడా సరైన కారణాలు ఏవీ బయటకు రాలేదు. ఎన్టీఆర్ డేట్స్ అడ్జస్ట్ చేయలేదని, అందుకే బుచ్చిబాబు ఇలా రామ్ చరణ్‌తో సినిమా తీయనున్నాడని తెలుస్తోంది.
Also Read : Jabardasth Ram Prasad : జబర్దస్త్ రాం ప్రసాద్‌కు ఏమైంది?.. అలా ఎందుకు కనిపించాడు.. పిక్స్ వైరల్
Also Read : Sudigali Sudheer Gaalodu : గాలోడు చించేసే కథేమి కాదు.. సినిమా చూసాక నాకు బాధేసింది.. తమ్మారెడ్డి భరద్వాజ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook