Naa Saami Ranga Twitter Review and Rating:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగార్జున హీరోగా, అషికా రంగనాథన్ హీరోయిన్ గా  విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందిన సినిమా నా సామి రంగా. ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, కరుణ కుమార్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాపై టీజర్ విడుదలైన దగ్గరనుంచి అంచనాలు భారీగా పెరిగాయి. మరోసారి నాగార్జున సోగ్గాడే చిన్నినాయన తరహాలో పండగకి మంచి కమర్షియల్ సినిమాతో రాబోతున్నారని ఈ చిత్ర ట్రైలర్ చూడగానే అందరికీ అర్థం అయిపోయింది.
ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా ఈరోజు జనవరి 14న విడుదలైన ఈ సినిమా గురించి సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..


నా సామిరంగా కు కీరవాణి ఆర్ఆర్ అదిరిపోయింది‌.. క్రీమ్ మామ డ్యూటీ అరాచకం అని ఒక అభిమాని పోస్ట్ వేశారు. 



‘నాగ్ ఇంట్రడక్షన్, అల్లరి నరేష్ నటన, నాగార్జున-ఆషికా రంగనాథ్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్ బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా ఎమోషనల్‌గా ఉంది. పాటలు బాగున్నాయి. అన్ని కరెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఇక ఆడియెన్స్ చేతుల్లో ఉంది రేంజ్. నా సామిరంగ హిట్టు బొమ్మ’ అని ఒక నెటిజన్ చెప్పుకొచ్చారు.


 



ఇలాంటి టైటిల్ కార్డుతో రెంప్ ఆడిస్తున్నావ్ అంటూ ఒక అభిమాని.. నాగార్జున పేరు వేసే సీన్ ని పోస్ట్ చేశారు..


 


 



ఫస్ట్ హాఫ్ పర్లేదు నాగార్జున సీన్స్ బానే ఉన్నాయి అంటూ మరో నేటిజన్ చెప్పుకొచ్చారు


 



కాగా ఈ చిత్రం గురించి ట్విట్టర్లో పెద్దగా సందడి కనిపించకపోవడం మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. నా సామి రంగా రివ్యూ ట్వీట్స్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అభిమానులు ఎక్కువగా షేర్ చేయలేదా లేకపోతే సినిమాకి పెద్దగా అంచనాలు లేవా అనే విషయం అర్థం కాక ..చాలామంది అభిమానులు అసలు నా సామిరంగా సినిమా బెనిఫిట్ షోస్ వేశారా.. ఎవరైనా వెళ్ళారా.. ఎలా ఉంది అని  పోస్ట్లు వేస్తున్నారు.


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook