`Naatu Naatu` Won Oscars 2023: ఆర్ఆర్ఆ`స్కా`ర్.. `నాటు నాటు` పాటను వరించిన ఆస్కార్
Naatu Naatu Won Oscars 2023: ఊహించించే జరిగింది. నాటు నాటుకు ఆస్కార్ వచ్చేసింది. ఆస్కార్ 2023లో ఇండియాకు రెండవ ఆస్కార్ ఇది. నాటు నాటు పాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో అవార్డు దక్కించుకుంది.
'Naatu Naatu' Song Won Oscars 2023: ఊహించించే జరిగింది. నాటు నాటుకు ఆస్కార్ వచ్చేసింది. ఆస్కార్ 2023లో ఇండియాకు రెండవ ఆస్కార్ ఇది. నాటు నాటు పాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో అవార్డు దక్కించుకుంది.
ఆస్కార్ అవార్జుల వేడుక అత్యంత ఘనంగా సాగుతోంది. ఓ వైపు ఇండియాకు తొలి ఆస్కార్ దక్కింది. మరోవైపు ఇండియన్ సినిమా నాటు నాటు పాట ఆస్కార్ వేదికను హోరెత్తించేసింది. అందరి అంచనాల్ని చేరుకుంటూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో అవార్డు సాధించేసింది. డోల్బీ థియేటర్ ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయింది.
అవార్డు ప్రకటించకముందే..నాటు నాటు పాటకు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన అత్యద్భుతంగా సాగింది. డోల్బీ ధియేటర్ అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ప్రదర్శన పూర్తవగానే అందరూ లేచి చప్పట్లతో గౌరవించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీ తుది నామినేషన్‌లో నిలిచి విజయం సాధించింది. నాటు నాటు పాటతో పాటు Applause( Tell it like a woman),Hold My Hand( Top Gun Maverick),Lift Me Up( Black Pather Wakanda Forever),This is a life( Everything Everywhere all at once) పాటలు పోటీ పడ్డాయి.
ఆస్కార్ 2023 వేడుకలో తొలిసారిగా ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డు వరించింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డు సాధించింది. మరోవైపు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో తుది నామినేషన్లలో ఉన్న నాటు నాటు పాట హోరెత్తించేసింది. రెండవ ఆస్కార్ అవార్డు దక్కించుకుంది.
Also read: Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా.. హిస్టరీ క్రియేట్ చేసిన నాటు నాటు పాట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి