Naatu Naatu Viral Videos: నాటు నాటు వైరల్ వీడియోలన్నీ ఒక ఎత్తు.. ఇదొక ఎత్తు..
Naatu Naatu Song Viral Videos: ఆర్ఆర్ఆర్ మూవీలోంచి నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని షేక్ చేయడం ఆపేలా లేదు. ఇంకా చెప్పాలంటే.. నాటు నాటు సాంగ్ కి ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరుగుతోందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం ఏదో ఒక వీడియో సోషల్ మీడియాను ఊపేస్తూనే ఉంది.
Naatu Naatu Song Viral Videos: ఆర్ఆర్ఆర్ మూవీలోంచి నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని షేక్ చేయడం ఆపేలా లేదు. ఇంకా చెప్పాలంటే.. నాటు నాటు సాంగ్ కి ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరుగుతోందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం ఏదో ఒక వీడియో సోషల్ మీడియాను ఊపేస్తూనే ఉంది. వివిధ రంగాల సెలబ్రిటీల నుంచి మొదలుకుని సాధారణ జనం వరకు నాటు నాటు సాంగ్ పై ఏదో ఒక క్రేజీ యాంగిల్లో వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అది కాస్తా వైరల్ గా మారడం గత కొన్ని రోజులుగా సర్వసాధారణంగా మారింది.
తాజాగా ప్రముఖ బిజినెస్ మేన్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహింద్రా నాటు నాటు సాంగ్‌కి సంబంధించిన ఒక వైరల్ వీడియోను షేర్ చేసుకున్నారు. తాను ఈ వీడియోను షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాను అంటూ ఆనంద్ మహింద్రా పోస్ట్ చేసిన ఆ వీడియోను చూస్తే.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.
నాటు నాటు సాంగ్‌కి జనం స్టెప్పులేయడమే ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియోలో నాటు నాటు పాటకు నీటుగా స్టెప్పులేసింది మనిషి కాదు.. మర బొమ్మ. అవును.. పొట్టకూటి కోసం బొమ్మలాడించుకోవడం చూసే ఉంటారు కదా... అది ఒక అరుదైన కళ కూడా. నాటు నాటు సాంగ్‌కి ఒక లేడీ తన బొమ్మతో స్టెప్పులేయిస్తున్న వీడియో చూస్తే ఎవ్వరైనా ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే.
నాటు నాటు సాంగ్ ట్యూన్ కి స్టెప్పులేసేది బొమ్మే అయినప్పటికీ.. ఆ బొమ్మ చేత స్టెప్పులేయించిన లేడీ మాస్టర్ గొప్పతనమే ఇందులో ఎక్కువగా గుర్తించాల్సిన అంశం. ఎందుకంటే ఒక వ్యక్తికి తన కాళ్లు చేతులు తన నియంత్రణలోనే ఉంటాయి కనుక వారు తమకు నచ్చిన డాన్స్ వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రాణం లేని బొమ్మ చేత డాన్స్ చేయించాలంటే.. వాళ్లు ఇంకెంత ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందో ఊహించుకోండి. ఇలా తాళ్ల సహాయంతో బొమ్మలను ఆడించే వారిని మరియొనెటిస్ట్ అంటారు. వారి చేతిలో ఉన్న బొమ్మను పప్పెట్ అంటారు. మన దేశంలో ఒకప్పుడు కీలు బొమ్మలాటకు ఎలాంటి ప్రాచుర్యం అయితే ఉందో.. అలాంటి ప్రాచుర్యమే ఈ ఆటకు కూడా ఉంది. అయితే, ఇలాంటి కళ ఎక్కువగా విదేశాల్లోనే కనిపిస్తుంది.