Nabha Natesh Shoulder Injury ఇస్మార్ట్ పోరి నభా నటేష్ చాలా రోజుల నుంచి సైలెంట్ అయిపోయింది. గత ఏడాది అంతా కూడా ఆమె సినిమాలు రాలేదు. సోషల్ మీడియాలో ఎక్కడా కూడా సందడి చేయలేదు. అసలు నభా ఉందా? లేదా? అన్నట్టుగా మారిపోయింది. అయితే దానికి గల కారణం ఇప్పుడు బయటకు వచ్చింది. తనకు ప్రమాదం జరిగిందని, భుజానికి ఎన్నో సర్జరీలు జరిగాయని అందుకే బయటకు రాలేకపోయానని చెప్పింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను అని, ఇకపై సినిమాలు చేస్తానంటూ నభా నటేష్ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 



నేను గత కొంత కాలం నుంచి మీకు దూరంగా ఉంటున్నాను అని నాకు తెలుసు.. నేను మిమ్మల్ని మిస్ అయినట్టుగానే మీరు కూడా నన్ను మిస్ అయి ఉంటారని నాకు తెలుసు.. నాకు గత ఏడాది అంతా కూడా ఎంతో కష్టంగా గడిచింది.. నాకు యాక్సిడెంట్ జరిగింది.. నా ఎడమ భుజానికి తీవ్రంగా గాయమైంది.. ఎముకలు విరిగిపోయాయ్.. ఎన్నో సర్జరీలు జరిగాయి.. శారీరకంగా, మానసికంగా ఎంతో బాధను అనుభవించాను.. ఆ బాధనంతా కూడా మీ ప్రేమతో జయించాను.. అదేమీ అంత సులభంగా అయితే జరగలేదు.. మీ ప్రేమతోనే ఇదంతా చేయగలిగాను.. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను.. ఇకపై మళ్లీ సినిమాలతో మీ ముందుకు వస్తాను.. మునుపటి కంటే మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తాను అంటూ నభా నటేష్ తెలిపింది.


నభా నటేష్‌ చివరగా సోలో బతుకే సో బెటర్ అనే సినిమాతో ఆడియెన్స్‌ను మెప్పించింది. అంతకు ముందు అల్లుడు అదుర్స్ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన నాసిరకం సినిమాలో కనిపించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే నభా ఇమేజ్ మారిపోయిన సంగతి తెలిసిందే.


Also Read: Keerthy Suresh Bikini : బికినీలో కీర్తి సురేష్‌.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. హీటెక్కించే పిక్స్


Also Read: Shaakuntalam Trailer.. శాకుంతలం ట్రైలర్.. మెస్మరైజ్ చేసిన సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదుర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి