Kalki 2898 AD Collections: 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే.. హీరోయిన్ గా నటించిన కల్కి 2898 ఏడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద.. కాసుల వర్షం కురిపిస్తోంది. భారీ స్థాయిలో.. ఓపెనింగ్ కలెక్షన్లు అందుకున్న ఈ చిత్రం మొదటి వారంతం పూర్తయ్యేదాకా కూడా అదే జోరుని కనపరిచింది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర.. పోషించిన ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించారు. 


భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ఓపెనింగ్ డే కలెక్షన్లతోనే రికార్డులు సృష్టించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే.. 220 కోట్లకు పైచిలుకు కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఇక ఆదివారం కూడా ఈ సినిమా 67.19 కోట్లు నెట్ కలెక్షన్లు, 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకుంది. 


రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే.. కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా కలెక్షన్లు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఆదివారం నాడు ఈ సినిమా థియేటర్లలో.. మంచి ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. ఆదివారం నాడు సినిమా తెలుగు వర్షన్.. 76.77 పర్సెంట్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకోగా, హిందీ వర్షన్ 54.12% నమోదు చేసుకుంది. ఇక కన్నడ ఆక్యుపెన్సీ 37.63. 


సినిమా విడుదలైన మొదటి రోజే.. 95.3 కోట్ల నెట్ కలెక్షన్లు అందుకుంది. అయితే శుక్రవారం నాటికి కలెక్షన్లు 57.6 కోట్లకి పడిపోయాయి. శనివారం నాడు మళ్లీ 67 కోట్లకి.. కలెక్షన్లు చేరుకున్నాయి. ఇక వారాంతం పూర్తయ్యేసరికి సినిమా 415 కోట్ల.. కలెక్షన్లు నమోదు చేసుకుంది. 


ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ సినిమా 9.1 మిలియన్ డాలర్ల ను వసూలు చేసుకుని.. ఓవర్సీస్ లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు అందుకున్న తెలుగు సినిమాల.. జాబితాలో పేరు నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్లు.. భారీగానే ఉన్నాయి.. కాబట్టి సినిమా.. ఎప్పటికి బ్రేక్ ఈవెన్ పాయింట్ ని చేరుకుంటుందో చూడాలి. 


దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, బ్రహ్మానందం, అన్నా బెన్, విజయ్ దేవరకొండ, దిశా పటాని, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ తదితరులు ఈ సినిమాలో.. క్యామియో పాత్రలలో కనిపించారు.


Also Read: NTR Bharosa Scheme: జగన్‌, చంద్రబాబు అక్కడి నుంచే.. ఆ ఊరికి అంత ప్రత్యేకం ఏమిటి?


Also Read: TDP Toll Free: మీ సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పాలా? అయితే ఈ నంబర్‌కు ఫోన్‌ చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter