Naga Babu Daughter : నిహారిక కోసం అబద్దాలు చెబుతున్న నాగబాబు.. మెగా బ్రదర్ పోస్ట్ వైరల్
Naga Babu Family Trip మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ఫుల్ చిల్ అవుతున్నాడు. భార్య పద్మజతో, కొడుకు వరుణ్ తేజ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తన కూతుర నిహారిక మాత్రం ఈ వెకేషన్స్‌లో కనిపించడం లేదు.
Naga Babu about Niharika : నిహారిక నాగబాబు తండ్రీకూతుళ్లుగా కంటే ఫ్రెండ్స్‌లా ఎక్కువగా సరదాగా ఉంటారు. ఈ ఇద్దరూ ఎంత ఫన్నీగా ఉంటారో అందరికీ తెలిసిందే. నిహారికను నాగబాబు ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటాడు. నిహారిక సైతం తన తండ్రితో సరదాగా ఉంటుంది.ఈ ఇద్దరూ ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ అందరినీ నవ్విస్తుంటారు. నిహారిక కోసం నాగబాబు అయితే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు.
నిహారిక, నాగబాబు చేసిన వెబ్ సిరీస్‌లు బాగానే క్లిక్ అయ్యాయి. అలా నాగబాబు తన కూతురి కోసం ఏం చేసేందుకు అయినా సిద్దమవుతాడు. నిహారిక పెళ్లి సమయంలో నాగబాబు తెగ ఎమోషనల్ అయ్యాడు. ఇకపై ఎలా ఉండాలో అంటూ ఎమోషనల్ పోస్టులతో అందరినీ కదిలించాడు. ఇలా తండ్రీకూతుళ్ల రిలేషన్‌ను చూసి అందరూ ముచ్చటపడుతుంటారు.
ఇక పెళ్లి చేసి పంపించిన తరువాత కూతురు ఎప్పుడూ పరాయి ఇంటి పిల్లే అవుతుంది. అయినా కూడా నిహారిక మాత్రం ప్రతీ రోజూ ఇంటికి వస్తుందట. మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్తుందట. నాగబాబు ఇంటి వద్దే ఉన్న జిమ్‌లో నిహారిక జాయిన్ అయిందట. అలా జిమ్ చేసి.. పుట్టింట్లో టిఫిన్ చేసి వెళ్తుందట. అయితే ఇప్పుడు నిహారికను వదిలేసి నాగబాబు, వరుణ్ తేజ్ సందడి చేస్తున్నారు.
నిహారిక.. మేం ఫుల్ ఎంజాయ్ చేశాం.. (అని అనాలని ఉంది కానీ నువ్ లేకుండా ఎంజాయ్ చేశామంటే హర్ట్ అవుతావ్ కాబట్టి.. అబ్బే మేం పెద్దగా ఎంజాయ్ చేయలేదు తల్లి) అంటూ సెటైర్ వేశాడు. ఇలా కూతురి కోసం అబద్దం చెప్పినట్టుగా నటించేశాడు నాగబాబు.ప్రస్తుతం నాగబాబు జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. తన స్నేహితులతో కలిసి వర్కౌట్లు చేస్తున్నాడు. నిహారిక అయితే తన వెబ్ సిరీస్ నిర్మాణంలో బిజీగా ఉంటోంది.
Also Read : The Kashmir Files సినిమాను కించపరిచిన జ్యూరీ మెంబర్.. క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్
Also Read : Upasana Konidela : గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు.. కొత్త ఆరంభం అంటూ ఉపాసన పోస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి