Naga Chaitanya Misleading News నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీని ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు. మీడియాకు ఇంటర్వ్యూలు మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈక్రమంలోనే ఓ యూట్యూబర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతనితో ముచ్చటించిన నాగ చైతన్య.. కొన్ని విషయాల మీద స్పందించాడు. అయితే ఇందులో భాగంగా నాగ చైతన్య చేసిన కామెంట్లు వైరల్ కాసాగాయి. అవి తప్పుగా ప్రచారంలోకి వచ్చాయంటూ.. తాను అలా అనలేదని చెప్పుకొచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ యూట్యూబర్ తన గతం గురించి చెప్పుకొచ్చాడు. తనకు ఓ లవర్ ఉండేదని, కానీ బ్రేకప్ అయిందని, అయితే ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌లా ఉందామని చెప్పిందంటూ సదరు యూట్యూబర్ చెప్పుకొచ్చాడు. దీంతో వెంటనే నాగ చైతన్య అందుకుని.. ఇలా ఫ్రెండ్స్‌గా ఉందామని చెప్పే విషయం అంటేనే తనకు చిరాకు అని నాగ చైతన్య అన్నాడు. అయితే ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా చక్కర్లు కొట్టాయి.


 



విడిపోయాక ఫ్రెండ్స్‌లా ఉందామనే మాటే తనకు నచ్చదని అన్నట్టుగా వార్తలు వచ్చాయి. తన ఎక్స్‌ల విషయంలోనూ అలానే ఉంటాడు అన్నట్టుగా రాశారు. సమంతతో కనీసం ఫ్రెండ్ షిప్ కూడా లేదా? అన్నట్టుగా ఇలా ఎవరికి తోచినట్టుగా వారు రాస్తూ వచ్చారు. దీంతో పూర్తి వీడియోను చూడమని తాను అసలు ఏం మాట్లాడానో తెలుస్తుందని, తాను అందరూ అనుకుంటున్నట్టుగా మాట్లాడలేదని ఇలా క్లారిటీ ఇచ్చుకుంటూ పోయాడు నాగ చైతన్య.


Also Read:  Manobala Death : ఇండస్ట్రీలో విషాదం.. నటుడు మనోబాల మృతి


నాగ చైతన్య చివరగా థాంక్యూ అంటూ డిజాస్టర్ సినిమాను అందించాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ దెబ్బతో డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ జాడ కూడా కనిపించకుండాపోయింది. దిల్ రాజుకు ఈ సినిమాతో భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కస్టడీ సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్‌ను మెప్పించేందుకు నాగ చైతన్య రెడీగా ఉన్నాడు.


Also Read:  Aadi Sai Kumar Wife : ఇలా కూడా ఉంటారా?.. ఆది సాయి కుమార్ భార్య కోరిక, కల ఇదేనట



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook