అక్కినేని నాగార్జున బర్త్ డే ( Nagarjuna Akkineni ) సందర్భంగా, నాగ చైతన్య తన తరువాత చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. మనం ఫేమ్‌ డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో ( Director Vikram Kumar ) నాగ చైతన్య సినిమా చేయబోతున్నట్లు గతంలో చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. నాగ చైతన్య ( Naga Chaitanya ) హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి గతంలో ప్రచారం జరుగుతున్న విధంగానే 'థాంక్యూ' ( Thank you ) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. Also read : HBD Akkineni Nagarjuna: మన్మథుడికి శుభాకాంక్షల వెల్లువ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగ చైతన్య చివరి రెండు చిత్రాలు మజిలీ, వెంకీ మామ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రంలో ( Love story ) మధ్య తరగతి యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో చైతూ సరసన మలయాళం బ్యూటీ సాయి పల్లవి ( Actress Sai Pallavi ) జంటగా నటిస్తోంది. లవ్ స్టొరీ సినిమా పూర్తయిన వెంటనే థాంక్యూ సెట్స్‌పైకి వెళ్ళబోతుంది. Also read : Vakeel Saab updates: వకీల్ సాబ్ టీజర్‌కి సమానంగా మోషన్ పోస్టర్


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం :