Naga Chaitanya Sobhita pre wedding videos: టాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ , అక్కినేని హీరో నాగచైతన్య ప్రేమించుకొని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు.. ఇటీవలే వీరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకొని అభిమానులను ఆశ్చర్యపరిచారు. డిసెంబర్ 4వ తేదీన శోభిత ,నాగచైతన్య  వివాహం జరగబోతున్నట్లు అందుకు సంబంధించి ఒక వెడ్డింగ్ కార్డు కూడా వైరల్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి సమయంలోనే పెళ్లికి ముందే నాగచైతన్య, శోభిత పలు రకాల ఈవెంట్స్ లలో కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నాగచైతన్య కుటుంబంతో శోభిత బాగా కలిసిపోయినట్టుగా కనిపిస్తోంది. 


ఇటీవలే గోవాలో జరిగిన IFFI 2024 వేడుకలలో భాగంగా నిన్నటి రోజున చాలామంది అగ్ర తారలు అక్కడ సందడి చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి అక్కినేని కుటుంబం  ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపించింది. ముఖ్యంగా కాబోయే జంట శోభిత - నాగచైతన్య ఇద్దరు కూడా ఇక్కడ సందడి చేయడం జరిగింది. 


రెడ్ కార్పెట్  పైన ఇద్దరు కూడా పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో పలువురు అభిమానులు ఇలా కామెంట్స్ చేస్తున్నారు.. "ఇది IFFI అవార్డ్స్ వేడుక లా లేదు.. నాగ చైతన్య, శోభిత ప్రీ  వెడ్డింగ్ షూట్ లా ఉందంటూ" పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. 


 



ఎనిమిది రోజులపాటు జరిగే ఈ వేడుకలు ఇండియన్ సినిమా పైన ఒక చెరగని ముద్ర వేసిన నలుగురు ప్రముఖుల శత జయంతి వేడుకలు సైతం ఇక్కడ జరిపి వారికి నివాళులు అర్పించబోతున్నారట.. అందులో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు కాగా.. మరొకరు మధుర గాయకుడు మహమ్మద్ రఫీ, అలాగే రాజ్ కపూర్, చివరిగా బెంగాలీ దర్శకుడు తపన్ సిన్హాకు నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ ఐఫా వేడుకలలో కూడా అక్కినేని కుటుంబంలో శోభిత నాగచైతన్య స్టైలిష్ గా కనిపించడం అందరిని ఆకట్టుకుంటోంది.


Read more: Gautam Adani: బిలియనీర్‌ గౌతమ్‌ అదానీకి బిగ్‌ షాక్‌.. అమెరికాలో అరెస్ట్‌ వారెంట్‌ జారీ.. ఎందుకో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.