Custody Movie Day 3 Collections: నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమా రూపొందింది. శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఏకకాలంలో తెలుగు తమిళ భాషల్లో రూపొందింది. ఈ సినిమాని మొన్న మే 12వ తేదీన తెలుగు సహా తమిళ భాషల్లో మూడు రాష్ట్రాలలో విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ సినిమా మొదటి రోజు వసూళ్లను తర్వాత అందుకోవడం కష్టంగా మారిపోయింది. నాగచైతన్య కెరీర్ లోనే భారీ డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎంతవరకు ఆయనకు ప్లస్ అవుతుందనే విషయం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా మొదటి రోజు కోటి 82 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాలలో వసూలు చేయగా రెండో రోజు 80 లక్షలు, మూడవరోజు 78 లక్షలు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల 45 లక్షల షేర్, ఆరు కోట్ల 25 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.


Also Read: Sunisith: చరణ్ ఫాన్స్ చేతుల్లో చావు దెబ్బలు తిన్న సునిషిత్ మమూలోడేమీ కాదు..ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?


మూడవరోజు ఏరియాల వారీగా కలెక్షన్స్ పరిశీలిస్తే నైజాం ప్రాంతంలో 24 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో ఎనిమిది లక్షలు, ఉత్తరాంధ్ర పది లక్షలు, ఈస్ట్ గోదావరి ఎనిమిది లక్షలు, వెస్ట్ గోదావరి ఆరు లక్షలు, గుంటూరు ఎనిమిది లక్షలు, కృష్ణ 9 లక్షలు, నెల్లూరు 5 లక్షలు కలిసి రెండు తెలుగు రాష్ట్రాలలో 78 లక్షల షేర్ 145 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా కర్ణాటక సహా మిగతా భారత దేశంలో మూడు రోజులకు గాను రెండు 20 లక్షలు వసూలు చేస్తే ఓవర్సీస్ లో కోటి రూపాయలు, తమిళ రాష్ట్రంలో 23 లక్షలు వసూలు చేసింది.


ఈ సినిమా టోటల్ తెలుగు బిజినెస్ ఇరవై ఒక్క కోట్ల 80 లక్షల జరుపుకోగా తమిళంలో రెండు కోట్ల 25 లక్షలు జరుపుకుంది. మొత్తం మీద చూస్తే ఈ సినిమా 24 కోట్ల ఐదు లక్షలకు అమ్ముడుపోగా 25 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్గా నిర్ణయించారు. ఈ సినిమా పూర్తి థియేట్రికల్ రన్ లో ఎంత డబ్బు వసూలు చేయగలిగితే అప్పుడు హిట్టవుతుంది. అయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిని బట్టి అంత వసూలు చేయడం అయితే కష్టంగానే చెప్పొచ్చు.


Also Read: Salaar Release Date:సలార్ రిలీజ్ డేట్ టెన్షన్.. అసలు విషయం చెప్పేసిన టీం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook