Naga Chaitanya: `చాలా హ్యాపీగా ఉంది..`విడాకుల అనంతరం తొలిసారి ట్వీట్ చేసిన చై
టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగ చైతన్య విడిపోయారు. వీరిద్దరూ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం నాగచైతన్య తొలిసారిగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏమని ట్వీట్ చేశారంటే..
Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగ చైతన్య తమ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి ఎంతో మంది ఫ్యాన్స్ కు నిరాశ మిగిల్చారు. గత కొన్ని రోజలుగా వార్తలు వస్తున్నా అవి నిజం కాకపోతే బాగుండు అని అటు అక్కినేని అభిమానులు సహా ఎంతోమంది నెటిజన్లు కోరుకున్నారు. కానీ ఆ వార్తలనే నిజం చేస్తూ...తామూ భార్యభర్తలుగా కొనసాగలేమని చై-సామ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
విడాకుల అనంతరం వీరిద్దరి సోషల్ మీడియా(Social Media) అకౌంట్లపై ఫోకస్ పెరిగింది.ఎప్పుడు ఏం మాట్లాడతారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా విడాకుల ప్రకటన అనంతరం నాగ చైతన్య(Naga Chaitanya) తొలిసారిగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది..లాట్స్ ఆఫ్ లవ్ అంటూ ట్వీట్(Tweet) చేశారు.
Also Read: ChaySam Divorce: చై-సామ్ విడిపోవడానికి ఆ బాలీవుడ్ స్టారే కారణం: కంగనా షాకింగ్ కామెంట్స్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Saidharam Tej) నిన్న హాస్పిటల్ బెడ్‌పై నుంచే ట్వీట్ చేశారు. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే మీ ముందుకు వస్తా వంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేయడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాగ చైతన్య సైతం సాయి తేజ్ తొందరగా కోలుకుంటున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి