COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్కినేని నాగ చైతన్య, సమంత రుతు ప్రభుల వివాహవేడుకలు గోవాలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వీరిద్దరూ మరికొద్ది గంటల్లో ఒక్కటి కానున్నారు. ముందుగా హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరగనుంది. నాగ చైతన్య, సమంత జోడీగా ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి చిత్రం ఏం మాయ చేసావే. ఆ సినిమా ఇద్దరి కెరీర్ లను మలుపుతిప్పింది. ఎన్ డి టి వీ కథనం మేరకు అక్టోబర్ 8 వ తేదీన క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరగనున్నట్లు సమాచారం. 


నాగ చైతన్యను పెళ్లి కొడుకు చేసిన ఫోటోలు, కుటుంబ సభ్యులు, వివాహ వేడుకలు సంబంధించిన ఫోటోలను  ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వివాహవేడుకలకు నాగ చైతన్య, సమంత కుటుంబసభ్యలతో కలిసి 100 మంది మాత్రమే హాజరవుతున్న సంగతి తెలిసిందే..!